కాఁపురాలు సేసేవారి గాకుసేయఁ దగునటే
(॥పల్లవి॥)
కాఁపురాలు సేసేవారి గాకుసేయఁ దగునటే
మాపు దాఁకా నీవెంత మలసేవే యెదుట
(॥కాఁపు॥)
మచ్చిక నే నితనితో మాఁటపలుకు లాడఁగా
ఇచ్చటికి వచ్చి నీవేమి వినేవే
అచ్చలాన నిద్దరమూ నాసతోడఁ గూచుండఁగా
కచ్చుపెట్టుక నీవేల కాచుకవుందానవే
(॥కాఁపు॥)
ననుపున మాలో నేము నవ్వుకొంటా నుండఁగాను
పనివూని నీవేల తప్పక చూచేవే
పెనఁగి వొండొరులము ప్రియములు చెప్పుకోఁగా
వెనుకొని నీవేల వెరగువడేవే
(॥కాఁపు॥)
అక్కజపురతుల నే మట్టె వోలలాడఁగాను
యెక్కడనుండో నీవు యెట్టు వచ్చేవే
ఇక్కువ శ్రీవేంకటేశుఁ డేలఁగా నే మెచ్చితేను
చక్కటి నీ వెందాఁకా నెచ్చరికలు సేసేవే
(||pallavi||)
kām̐purālu sesevāri gāguseyam̐ dagunaḍe
mābu dām̐kā nīvĕṁta malaseve yĕduḍa
(||kām̐pu||)
machchiga ne nidanido mām̐ṭabalugu lāḍam̐gā
ichchaḍigi vachchi nīvemi vineve
achchalāna niddaramū nāsadoḍam̐ gūsuṁḍam̐gā
kachchubĕṭṭuga nīvela kāsugavuṁdānave
(||kām̐pu||)
nanubuna mālo nemu navvugŏṁṭā nuṁḍam̐gānu
panivūni nīvela tappaga sūseve
pĕnam̐gi vŏṁḍŏrulamu priyamulu sĕppugom̐gā
vĕnugŏni nīvela vĕraguvaḍeve
(||kām̐pu||)
akkajaburadula ne maṭṭĕ volalāḍam̐gānu
yĕkkaḍanuṁḍo nīvu yĕṭṭu vachcheve
ikkuva śhrīveṁkaḍeśhum̐ ḍelam̐gā ne mĕchchidenu
sakkaḍi nī vĕṁdām̐kā nĕchcharigalu seseve