Kaampuraalu sesedi ye kaalamo kaani

కాఁపురాలు సేసేది యే కాలమో కాని
Language

(॥పల్లవి॥)
కాఁపురాలు సేసేది యే కాలమో కాని
ఆఁపరాని తమకము లందుకోనే పట్టెను

(॥కాఁపు॥)
వాసులకే పెనఁగీని వంతులకే లాచీని
వేసర దెంతైనాఁ జెలి విభునితోను
ఆసలనే పొరలీని ఆయములే కరఁగీని
సేస వెట్టిన మొదలు చెనకనే పట్టెను

(॥కాఁపు॥)
యెగ్గెఱఁగక నవ్వీని యిట్టె మోవికి నోరూరీ
అగ్గళికెంతో కాని అంగనకును
వొగ్గి సన్న లెల్లాఁ జేసీ వొయ్యారాలే చూపీని
సిగ్గులు వచారించి చీరగట్టాఁ బట్టెను

(॥కాఁపు॥)
మునుపుగాఁగాఁగిలించీ ముచ్చటలే యాడీని
తనివి యంతటనో తరుణికిని
తను నింతలోఁ గూడె తగ శ్రీ వేంకటేశుఁడు
చనవులు చెప్పుకోను సంతోసించాఁ బట్టెను

(||pallavi||)
kām̐purālu sesedi ye kālamo kāni
ām̐parāni tamagamu laṁdugone paṭṭĕnu

(||kām̐pu||)
vāsulage pĕnam̐gīni vaṁtulage lāsīni
vesara dĕṁtainām̐ jĕli vibhunidonu
āsalane pŏralīni āyamule karam̐gīni
sesa vĕṭṭina mŏdalu sĕnagane paṭṭĕnu

(||kām̐pu||)
yĕggĕṟam̐gaga navvīni yiṭṭĕ movigi norūrī
aggaḽigĕṁto kāni aṁganagunu
vŏggi sanna lĕllām̐ jesī vŏyyārāle sūbīni
siggulu vasāriṁchi sīragaṭṭām̐ baṭṭĕnu

(||kām̐pu||)
munubugām̐gām̐giliṁchī muchchaḍale yāḍīni
tanivi yaṁtaḍano taruṇigini
tanu niṁtalom̐ gūḍĕ taga śhrī veṁkaḍeśhum̐ḍu
sanavulu sĕppugonu saṁtosiṁchām̐ baṭṭĕnu