కాఁపులము నేము నీకు కర్తవు నీవు మాకు
(॥పల్లవి॥)
కాఁపులము నేము నీకు కర్తవు నీవు మాకు
దాపుదండై బదికించి దయఁ జూడవయ్యా
(॥కాఁపు॥)
గుట్టున అయిదు ప్రాణాలకు డాగు వెట్టేము
పట్టి దేహముల విడుఁబట్టు లివిగో
అట్టె కర్మములనేటి అరిగోరులు వెట్టేము
నుట్టుకొట్టి జీవులకు నరకము లేలయ్యా
(॥కాఁపు॥)
మించిన పితాళ్లకు మేర లేలఁబెట్టేము
పొంచి సంసారములలోఁ గాఁపుర మున్నాము
పంచేంద్రియపు పొలాలపైరు లెల్లాఁ జేసితిమి
అంచె దేహులకెల్ల ఆజ్ఞలేడ వయ్యా
(॥కాఁపు॥)
కూరిమి విషయముల కొట్నములు దంచేము
చేరి నీచైతన్యమున సేవసేసేము
యీతి శ్రీ వేంకటేశ యిటు నీకే దాసులము
ఆరయఁ గాచితివి నీయాధీనులమయ్యా
(||pallavi||)
kām̐pulamu nemu nīgu kardavu nīvu māgu
dābudaṁḍai badigiṁchi dayam̐ jūḍavayyā
(||kām̐pu||)
guṭṭuna ayidu prāṇālagu ḍāgu vĕṭṭemu
paṭṭi dehamula viḍum̐baṭṭu livigo
aṭṭĕ karmamulaneḍi arigorulu vĕṭṭemu
nuṭṭugŏṭṭi jīvulagu naragamu lelayyā
(||kām̐pu||)
miṁchina pidāḽlagu mera lelam̐bĕṭṭemu
pŏṁchi saṁsāramulalom̐ gām̐pura munnāmu
paṁcheṁdriyabu pŏlālabairu lĕllām̐ jesidimi
aṁchĕ dehulagĕlla ājñaleḍa vayyā
(||kām̐pu||)
kūrimi viṣhayamula kŏṭnamulu daṁchemu
seri nīsaidanyamuna sevasesemu
yīdi śhrī veṁkaḍeśha yiḍu nīge dāsulamu
ārayam̐ gāsidivi nīyādhīnulamayyā