కాఁపులము నేము కర్తవు నీవు
(॥పల్లవి॥)
కాఁపులము నేము కర్తవు నీవు
దాపుదండై మము నిట్టే దయఁ జూడవయ్యా
(॥కాఁపు॥)
నెట్టన నైదుగురికి నేము డాగువెట్టేము
చుట్టి చుట్టి వీడుఁ బట్టుచూపి వున్నది
అట్టె కర్మములకు సరిగోరు వెట్టేము
నట్టుకొట్టి(ట్టే?) జీవులకు నరకములేలయ్యా
(॥కాఁపు॥)
మించిన యాసలకిదే మేరలెల్లాఁ బెట్టేము
పొంచి మమతలలోఁ గాఁపుర మున్నారం(ము?)
పంచేంద్రియములకే పైరులు సేసితిమి
అంచెలఁ బ్రాణులకిఁక నానాజ్ఞలేలయ్యా
(॥కాఁపు॥)
కూరిమి విషయముల కొట్నాలు దంచేము
చేరి నీవు చెప్పినట్టే సేసేము
యీరీతి శ్రీవేంకటేశ యిటు నీకే దాసులము
ఆరూఢిగా మన్నించితివంతే చాలు నౌనయ్యా
(||pallavi||)
kām̐pulamu nemu kardavu nīvu
dābudaṁḍai mamu niṭṭe dayam̐ jūḍavayyā
(||kām̐pu||)
nĕṭṭana naidugurigi nemu ḍāguvĕṭṭemu
suṭṭi suṭṭi vīḍum̐ baṭṭusūbi vunnadi
aṭṭĕ karmamulagu sarigoru vĕṭṭemu
naṭṭugŏṭṭi(ṭṭe?) jīvulagu naragamulelayyā
(||kām̐pu||)
miṁchina yāsalagide meralĕllām̐ bĕṭṭemu
pŏṁchi mamadalalom̐ gām̐pura munnāraṁ(mu?)
paṁcheṁdriyamulage pairulu sesidimi
aṁchĕlam̐ brāṇulagim̐ka nānājñalelayyā
(||kām̐pu||)
kūrimi viṣhayamula kŏṭnālu daṁchemu
seri nīvu sĕppinaṭṭe sesemu
yīrīdi śhrīveṁkaḍeśha yiḍu nīge dāsulamu
ārūḍhigā manniṁchidivaṁte sālu naunayyā