కాఁకసేయఁ దగవా కలయఁగఁ దగుఁగాక
(॥పల్లవి॥)
కాఁకసేయఁ దగవా కలయఁగఁ దగుఁగాక
మూఁకలాయఁ బులకలు మొకమియ్యరాదా
(॥కాఁక॥)
రమణుని ఆడనీడ రవ్వసేయఁ దగవా
తమి నట్టే బుద్దిచెప్పఁదగుఁ గాక
నెమకి యాతడు వేరో నీవు నింతదానవో
చెమరించె మీ మేనులు చిత్తగించరాదా
(॥కాఁక॥)
చేసుకొన్న మగనినిఁ జిమ్మిరేఁచఁ దగవా
త్రాసులై సరసమాడఁ దగుఁగాక
మోసము నీకుఁ గలదో మోహ మాతనికి లేదో
సేసకొప్పు లవే వీడెఁ జెకొనఁగరాదా
(॥కాఁక॥)
యేలిన శ్రీ వేంకటేశు కెదురాడఁ దగవా
తాలిమి నిట్ల గూడఁదగుఁగాక
నీలాగు నే నెఱఁగనో నీవే ఆతఁడవు గావో
కాలుఁగాలుఁ దొక్కితిరి కరుణించ రాదా
(||pallavi||)
kām̐kaseyam̐ dagavā kalayam̐gam̐ dagum̐gāga
mūm̐kalāyam̐ bulagalu mŏgamiyyarādā
(||kām̐ka||)
ramaṇuni āḍanīḍa ravvaseyam̐ dagavā
tami naṭṭe buddisĕppam̐dagum̐ gāga
nĕmagi yādaḍu vero nīvu niṁtadānavo
sĕmariṁchĕ mī menulu sittagiṁcharādā
(||kām̐ka||)
sesugŏnna maganinim̐ jimmirem̐sam̐ dagavā
trāsulai sarasamāḍam̐ dagum̐gāga
mosamu nīgum̐ galado moha mādanigi ledo
sesagŏppu lave vīḍĕm̐ jĕgŏnam̐garādā
(||kām̐ka||)
yelina śhrī veṁkaḍeśhu kĕdurāḍam̐ dagavā
tālimi niṭla gūḍam̐dagum̐gāga
nīlāgu ne nĕṟam̐gano nīve ādam̐ḍavu gāvo
kālum̐gālum̐ dŏkkidiri karuṇiṁcha rādā