Kaamkala nogadogade gadimchugonevu neeve

కాఁకల నొకటొకటె గడించుకొనేవు నీవె
Language

(॥పల్లవి॥)
కాఁకల నొకటొకటె గడించుకొనేవు నీవె
సోఁకించి నీ మేను నే సోదించవచ్చితినా

(॥కాక॥)
వేడుకకు నీతో నవ్వితిఁగాక యేమైనా
తోడనే కేరడాలు నీతోఁ జేసేనా
యీడ నీవొంటి నుండఁగా ఇటు తోడుండితిఁగాక
జాడతో నమ్మక నీసంగడికి వచ్చేనా

(॥కాక॥)
చక్కనినీరూపు నే నాసలతోఁ జూచితిఁగాక
టెక్కులకు చూపులు నాటించవచ్చేనా
మక్కువగలిగి నిన్ను మాడలాడించితిఁగాక
వెక్కసపు నీసుద్దులు వెల్చుకొనేనా

(॥కాక॥)
కందువల నిన్ను మెచ్చి కాఁగిలించుకొంటిఁగాక
సందడిఁ బెనఁగి నీపై సత్వ చూపేనా
ఇందునె శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
అంది కూడితివి నిన్ను నాఱడిఁ బెట్టేనా

(||pallavi||)
kām̐kala nŏgaḍŏgaḍĕ gaḍiṁchugŏnevu nīvĕ
som̐kiṁchi nī menu ne sodiṁchavachchidinā

(||kāga||)
veḍugagu nīdo navvidim̐gāga yemainā
toḍane keraḍālu nīdom̐ jesenā
yīḍa nīvŏṁṭi nuṁḍam̐gā iḍu toḍuṁḍidim̐gāga
jāḍado nammaga nīsaṁgaḍigi vachchenā

(||kāga||)
sakkaninīrūbu ne nāsaladom̐ jūsidim̐gāga
ṭĕkkulagu sūbulu nāḍiṁchavachchenā
makkuvagaligi ninnu māḍalāḍiṁchidim̐gāga
vĕkkasabu nīsuddulu vĕlsugŏnenā

(||kāga||)
kaṁduvala ninnu mĕchchi kām̐giliṁchugŏṁṭim̐gāga
saṁdaḍim̐ bĕnam̐gi nībai satva sūbenā
iṁdunĕ śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
aṁdi kūḍidivi ninnu nāṟaḍim̐ bĕṭṭenā