కాఁక నీవు రేఁచఁగాను కన్నవారినేల దూరీ
(॥పల్లవి॥)
కాఁక నీవు రేఁచఁగాను కన్నవారినేల దూరీ
వీఁకపుఁ గోరికతోడ విఱ్ఱవీఁగీని
(॥కాఁక॥)
కోమలి నిన్నుఁబాసి కోవిలకూఁతలు విని
వేమరు కోపానవుంట వింట వేసీని
ఆమని చిగురు చూచి అంతలోనే వేసారి
దోమటికొనగోరి కత్తులు చాఁచీని
(॥కాఁక॥)
వెన్నెల తేటలు చూచి విసుగుచు వెళ్ళఁజల్లీ
కిన్నెరకాయల ముంచి కిమ్ములకును
తిన్నని మేఘము చూచి తిట్టుచు నీరెల్లఁగార
సన్నపుటల్లికామల చాఁచి పిలిచీని
(॥కాఁక॥)
తుమ్మెద మూఁకలఁ జూచి దూరుచు తురుములోని
కొమ్మ సంపెంగ విరులఁ గొని వేసీని
నెమ్మది శ్రీ వెంకటేశ నీవింతలోఁ గూడఁగాను
కమ్మి మరుబలములఁ గని నవ్వీని
(||pallavi||)
kām̐ka nīvu rem̐sam̐gānu kannavārinela dūrī
vīm̐kabum̐ gorigadoḍa viṭravīm̐gīni
(||kām̐ka||)
komali ninnum̐bāsi kovilagūm̐talu vini
vemaru kobānavuṁṭa viṁṭa vesīni
āmani siguru sūsi aṁtalone vesāri
domaḍigŏnagori kattulu sām̐sīni
(||kām̐ka||)
vĕnnĕla teḍalu sūsi visugusu vĕḽḽam̐jallī
kinnĕragāyala muṁchi kimmulagunu
tinnani meghamu sūsi tiṭṭusu nīrĕllam̐gāra
sannabuḍalligāmala sām̐si pilisīni
(||kām̐ka||)
tummĕda mūm̐kalam̐ jūsi dūrusu turumuloni
kŏmma saṁpĕṁga virulam̐ gŏni vesīni
nĕmmadi śhrī vĕṁkaḍeśha nīviṁtalom̐ gūḍam̐gānu
kammi marubalamulam̐ gani navvīni