Kaaminula keppudunum galigina saajamidi

కామినుల కెప్పుడునుఁ గలిగిన సాజమిది
Language

(॥పల్లవి॥)
కామినుల కెప్పుడునుఁ గలిగిన సాజమిది
తా మగఁడు నే నాలను దయఁ జూడు మనవే

(॥॥)
చిత్తము రా నూడిగము సేసితినో సేయనో
హత్తి యెదురు మాట లే మాడితినో
యెత్తి చేతుల మొక్కేను యిన్నిటికి సెలవుగా
బత్తి చేకొని నన్నిట్టే పాయ కుండు మనవే

(॥॥)
నిచ్చలు నుపచరించ నేరుతునో నేరనో
ఇచ్చ రతి నెంత యలయించితినో
యెచ్చు కుందులెల్లఁ దీర నిదివో ప్రియము చెప్పె
మచ్చిక నలుక దేరి మన్నించు మనవే

(॥॥)
యెనసి వేడుక మోవి యిచ్చితినో యియ్యనో
చనుఁగవ నెంత వొత్తి జరసితినో
అనువై శ్రీ వేంకటేశుఁ డలమేల్మంగను నేను
చనవు చెల్లించి నన్ను సారెఁ గూడు మనవే.

(||pallavi||)
kāminula kĕppuḍunum̐ galigina sājamidi
tā magam̐ḍu ne nālanu dayam̐ jūḍu manave

(||||)
sittamu rā nūḍigamu sesidino seyano
hatti yĕduru māḍa le māḍidino
yĕtti sedula mŏkkenu yinniḍigi sĕlavugā
batti segŏni nanniṭṭe pāya kuṁḍu manave

(||||)
nichchalu nubasariṁcha neruduno nerano
ichcha radi nĕṁta yalayiṁchidino
yĕchchu kuṁdulĕllam̐ dīra nidivo priyamu sĕppĕ
machchiga naluga deri manniṁchu manave

(||||)
yĕnasi veḍuga movi yichchidino yiyyano
sanum̐gava nĕṁta vŏtti jarasidino
anuvai śhrī veṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
sanavu sĕlliṁchi nannu sārĕm̐ gūḍu manave.