కామినిసింగారాల కాలమువేళ లెరిఁగి
(॥పల్లవి॥)
కామినిసింగారాల కాలమువేళ లెరిఁగి
భూమిలోన నిన్నిటాను భోగించవయ్యా
(॥కామి॥)
నిలుపుఁదురుముఁ జారి నిండా జీఁకటివడె
సొలపు మోవి కెంపులఁ జుక్కలు నిండె
మొలచిన కళల మోమునఁ జంద్రుఁడుదయించె
వెలలేని నగవుల వెన్నెలగానె
(॥కామి॥)
అదనఁ గనుఁగొనల నరుణోదయంబాయ
యెదలోని సంతోషాన నిదె వేఁగెను
పొదలు రతికాఁకను పొద్దులువొడచి వచ్చె
ఇదివొ తమకమున నీరెండలూఁ గాసెను
(॥కామి॥)
చెక్కుల చిరు చెమట చిక్కని మంచు గురిసె
చక్కఁగా పులకల వసం తము వచ్చె
యిక్కువ శ్రీవెంకటేశ యింతినిట్టె కూడితివి
యెక్కువాయ దినముల యేండ్లకొలఁదుల
(||pallavi||)
kāminisiṁgārāla kālamuveḽa lĕrim̐gi
bhūmilona ninniḍānu bhogiṁchavayyā
(||kāmi||)
nilubum̐durumum̐ jāri niṁḍā jīm̐kaḍivaḍĕ
sŏlabu movi kĕṁpulam̐ jukkalu niṁḍĕ
mŏlasina kaḽala momunam̐ jaṁdrum̐ḍudayiṁchĕ
vĕlaleni nagavula vĕnnĕlagānĕ
(||kāmi||)
adanam̐ ganum̐gŏnala naruṇodayaṁbāya
yĕdaloni saṁtoṣhāna nidĕ vem̐gĕnu
pŏdalu radigām̐kanu pŏdduluvŏḍasi vachchĕ
idivŏ tamagamuna nīrĕṁḍalūm̐ gāsĕnu
(||kāmi||)
sĕkkula siru sĕmaḍa sikkani maṁchu gurisĕ
sakkam̐gā pulagala vasaṁ tamu vachchĕ
yikkuva śhrīvĕṁkaḍeśha yiṁtiniṭṭĕ kūḍidivi
yĕkkuvāya dinamula yeṁḍlagŏlam̐dula