కామినిభావము నేఁడు కంటివా నీవు
(॥పల్లవి॥)
కామినిభావము నేఁడు కంటివా నీవు
కోమలపు కొత్తపెండ్లికొడుక వైనాఁడవు
(॥॥)
నిలిచి యేకతమున నీపై గీతాలు వాడి
చెలి నీ వంతలో రాఁగా సిగ్గువడెను
నలిరేఁగి నీవందుకు నవ్వినవ్వి మెచ్చఁగాను
కులికి కులికి మేనఁ గురిసీఁ జెమట
(॥॥)
చతురత నీదట్టి చన్నులపై గప్పుకొని
తతి నట్టె నిన్నుఁజూచి తలవంచెను
కతలుగా నీవందుకు కరుణతోఁ బొఁగడఁగా
కుతుకపుతమకాన గుప్పీఁబులకలు
(॥॥)
నెట్టన శ్రీవేంకటేశ నీపానుపుపైఁబండి
అట్టె నీవు కూడఁగా నరుదందెను
వొట్టి నీవందుకు నన్ను నొనరి బుజ్జగించఁగా
ముట్టిననీరతులలో ముంచీ వలపులు
(||pallavi||)
kāminibhāvamu nem̐ḍu kaṁṭivā nīvu
komalabu kŏttabĕṁḍligŏḍuga vainām̐ḍavu
(||||)
nilisi yegadamuna nībai gīdālu vāḍi
sĕli nī vaṁtalo rām̐gā sigguvaḍĕnu
nalirem̐gi nīvaṁdugu navvinavvi mĕchcham̐gānu
kuligi kuligi menam̐ gurisīm̐ jĕmaḍa
(||||)
sadurada nīdaṭṭi sannulabai gappugŏni
tadi naṭṭĕ ninnum̐jūsi talavaṁchĕnu
kadalugā nīvaṁdugu karuṇadom̐ bŏm̐gaḍam̐gā
kudugabudamagāna guppīm̐bulagalu
(||||)
nĕṭṭana śhrīveṁkaḍeśha nībānububaim̐baṁḍi
aṭṭĕ nīvu kūḍam̐gā narudaṁdĕnu
vŏṭṭi nīvaṁdugu nannu nŏnari bujjagiṁcham̐gā
muṭṭinanīradulalo muṁchī valabulu