Kaamini yappadinumdi kaasugunnadi

కామిని యప్పటినుండి కాచుకున్నది
Language

(॥పల్లవి॥)
కామిని యప్పటినుండి కాచుకున్నది
దోమటి వలపులకు దోసమున్నదా

(॥కామి॥)
మంతనమాడఁ గరాదా మలసి యప్పటనుండి
యింతి నిన్నుఁ బిలిచీని యేకతానకు
వింతవా రుండితే నేఁడు వెఱపేల వచ్చె నీకు
దొంతరవలపులకు దోసమున్నదా

(॥కామి॥)
పమ్మి చేయిచాఁచఁగరాదా పందెమువేసేనంటా
యెమ్మెలకే పెనఁగీని యీపె నీతోను
చిమ్ముచు నామోము చూచి సిగ్గేల వచ్చె నీకు
దొమ్మి వలపుల కింత దోసమున్నదా

(॥కామి॥)
గడ్డమువట్టఁగరాదా కాఁగిలించుకొనేనంటా
వొడ్డుక వున్నవి చన్ను లువిదకును
అడ్డమై శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
దొడ్డివలపులకును దోసమున్నదా

(||pallavi||)
kāmini yappaḍinuṁḍi kāsugunnadi
domaḍi valabulagu dosamunnadā

(||kāmi||)
maṁtanamāḍam̐ garādā malasi yappaḍanuṁḍi
yiṁti ninnum̐ bilisīni yegadānagu
viṁtavā ruṁḍide nem̐ḍu vĕṟabela vachchĕ nīgu
dŏṁtaravalabulagu dosamunnadā

(||kāmi||)
pammi seyisām̐sam̐garādā paṁdĕmuvesenaṁṭā
yĕmmĕlage pĕnam̐gīni yībĕ nīdonu
simmusu nāmomu sūsi siggela vachchĕ nīgu
dŏmmi valabula kiṁta dosamunnadā

(||kāmi||)
gaḍḍamuvaṭṭam̐garādā kām̐giliṁchugŏnenaṁṭā
vŏḍḍuga vunnavi sannu luvidagunu
aḍḍamai śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
dŏḍḍivalabulagunu dosamunnadā