కామిని యప్పటినుండి కాచుకున్నది
(॥పల్లవి॥)
కామిని యప్పటినుండి కాచుకున్నది
యీ మోహ మెఱఁగకున్న నెగ్గు వట్టుఁ జుమ్మీ
(॥కామిని॥)
చక్కఁ జూడ రాదా సతి నిన్నుఁ జూడఁ గాను
యెక్కడో పరా కై యేమి సేసేవు
మొక్కి నాపెవిద మెంత ముంచి నీరాజస మెంత
తక్కు లిఁక మాన కున్న తమకించుఁ జుమ్మీ
(॥కామిని॥)
మాట లాడ రాదా మగువ నిలుచుండఁగ
నేఁటికి నీకుచ్చితము లేల చూపేవు
మేఁటి యాపెప్రియ మేడ మించిన ఈ బలు మేడ
నీటుతో మన్నింప కున్న నేరమి యౌ జుమ్మీ
(॥కామిని॥)
చిత్తగించ రాదా చెలి వద్దఁ గూచుండఁగ
యెత్తిన నీ యెమ్మె లింక నేల మానవూ
పొత్తుల శ్రీవెంకటేశ పొందితి వీపె నింతట
హత్తి యిట్టె వుండ కున్న నాఱడి యౌఁ జుమ్మీ
(||pallavi||)
kāmini yappaḍinuṁḍi kāsugunnadi
yī moha mĕṟam̐gagunna nĕggu vaṭṭum̐ jummī
(||kāmini||)
sakkam̐ jūḍa rādā sadi ninnum̐ jūḍam̐ gānu
yĕkkaḍo parā kai yemi sesevu
mŏkki nābĕvida mĕṁta muṁchi nīrājasa mĕṁta
takku lim̐ka māna kunna tamagiṁchum̐ jummī
(||kāmini||)
māḍa lāḍa rādā maguva nilusuṁḍam̐ga
nem̐ṭigi nīguchchidamu lela sūbevu
mem̐ṭi yābĕpriya meḍa miṁchina ī balu meḍa
nīḍudo manniṁpa kunna nerami yau jummī
(||kāmini||)
sittagiṁcha rādā sĕli vaddam̐ gūsuṁḍam̐ga
yĕttina nī yĕmmĕ liṁka nela mānavū
pŏttula śhrīvĕṁkaḍeśha pŏṁdidi vībĕ niṁtaḍa
hatti yiṭṭĕ vuṁḍa kunna nāṟaḍi yaum̐ jummī