(॥పల్లవి॥)
కామిని యందరిలోనాఁ గడుగోల
నీ మనసుకొలఁదికి నేర్పవయ్యా కతలు
(॥కామి॥)
సెలవుల నవ్వఁగాను చేతులెత్తి మొక్కఁగాను
చలము సాదింతురా సతులతోను
అలిగివుండినదని అగడుసేసే వూరకే
చెలి యేమిసేయవలెఁ జెప్పవయ్యా బుద్దులు
(॥కామి॥)
గుట్టుననే వుండఁగాను కొలువులు సేయఁగాను
బట్టబయలీఁదింతురా పడఁతులను
గట్టువాయతనమని కన్నవారితోఁ జెప్పేవు
చుట్ట మీకె నీవు చేసిచూపవయ్యా చేఁతలు
(॥కామి॥)
చెంతనే కూచుండఁగాను జిగిఁబాదాలొత్తఁగాను
పంతములాడుదురా భామలతోను
ఇంతలోఁ గూడి శ్రీవేంకటేశ కడుఁ గొసరేవు
వింతలే నివింకాఁ జదివించవయ్యా రతులు
(||pallavi||)
kāmini yaṁdarilonām̐ gaḍugola
nī manasugŏlam̐digi nerbavayyā kadalu
(||kāmi||)
sĕlavula navvam̐gānu sedulĕtti mŏkkam̐gānu
salamu sādiṁturā saduladonu
aligivuṁḍinadani agaḍusese vūrage
sĕli yemiseyavalĕm̐ jĕppavayyā buddulu
(||kāmi||)
guṭṭunane vuṁḍam̐gānu kŏluvulu seyam̐gānu
baṭṭabayalīm̐diṁturā paḍam̐tulanu
gaṭṭuvāyadanamani kannavāridom̐ jĕppevu
suṭṭa mīgĕ nīvu sesisūbavayyā sem̐talu
(||kāmi||)
sĕṁtane kūsuṁḍam̐gānu jigim̐bādālŏttam̐gānu
paṁtamulāḍudurā bhāmaladonu
iṁtalom̐ gūḍi śhrīveṁkaḍeśha kaḍum̐ gŏsarevu
viṁtale niviṁkām̐ jadiviṁchavayyā radulu