Kaamini seliga ttiyam gana vinnavimchidi

కామిని చెలిక త్తియఁ గన విన్నవించితి
Language

(॥పల్లవి॥)
కామిని చెలిక త్తియఁ గన విన్నవించితి
ప్రేమ జవ్వనమదపు పెండ్లికొడుకవు

(॥కామి॥)
నివ్వెరగుతో నున్నది నెలఁత నిన్నుఁ జూచి
చివ్వన మోవి గంటిసేసేవు సుమ్మీ
వువ్విళ్లూ రేవలపుల నొడ్డించుకో నెరఁగదు
నొవ్వఁ బిసుకకుమీ చన్నులు కడుగొప్పలు

(॥కామి॥)
కోరికల తలపోఁతఁ గొలువులో నున్నది
చేరి సిగ్గులు బయలుసేసేవు సుమ్మీ
గారవపుమెయిసోఁకులఁ గరఁగుతా నున్నది
గోర గీరేవు మీ చెక్కులు కోమలములు

(॥కామి॥)
పట్టరానితమితోబఁ బాదా లొత్తుతా నున్నది
చిట్టకములెల్లా నేఁడే సేసేవు సుమ్మీ
గట్టిగ శ్రీవేంకటేశ కలసితి వీకె మొక్కీ
పట్టకుమీ తురుమిది బారెఁడేసినెరులు

(||pallavi||)
kāmini sĕliga ttiyam̐ gana vinnaviṁchidi
prema javvanamadabu pĕṁḍligŏḍugavu

(||kāmi||)
nivvĕragudo nunnadi nĕlam̐ta ninnum̐ jūsi
sivvana movi gaṁṭisesevu summī
vuvviḽlū revalabula nŏḍḍiṁchugo nĕram̐gadu
nŏvvam̐ bisugagumī sannulu kaḍugŏppalu

(||kāmi||)
korigala talabom̐tam̐ gŏluvulo nunnadi
seri siggulu bayalusesevu summī
gāravabumĕyisom̐kulam̐ garam̐gudā nunnadi
gora gīrevu mī sĕkkulu komalamulu

(||kāmi||)
paṭṭarānidamidobam̐ bādā lŏttudā nunnadi
siṭṭagamulĕllā nem̐ḍe sesevu summī
gaṭṭiga śhrīveṁkaḍeśha kalasidi vīgĕ mŏkkī
paṭṭagumī turumidi bārĕm̐ḍesinĕrulu