కామిని సరసములే కామధేనువులు గావా
(॥పల్లవి॥)
కామిని సరసములే కామధేనువులు గావా
రామల తిట్ల కింత రవ్వసేయఁ దగవా
(॥కామి॥)
వెలఁదినవ్వుల వెన్నెలలు గాసీ నీపై
చెలువుఁడ చిత్తానఁ జీఁకటేలయ్యా
ములువాఁడికొనగోరు మోపినయందు కేమాయ
వలపు లింతేసి నీకు వడిఁ బెట్టఁదగునా
(॥కామి॥)
వనితచెమటలనే వానలు గురియఁగాను
వెనకటియలుకలవెట్ట యేలయ్య
వెనుకొని పూబంతిని వేసితే నందుకేమాయ
చనవులు నీ వింత చండిపెట్టఁదగునా
(॥కామి॥)
అలమేల్మంగ కాఁగిట నామనియై వుండఁగాను
అల రతిఁ దనియనిఅక్కరేలయ్య
పిలిచి శ్రీవేంకటేశ పెనఁగితేనేమాయ
మొలకసిగ్గు తప్పుడే మూఁటగట్టఁదగునా
(||pallavi||)
kāmini sarasamule kāmadhenuvulu gāvā
rāmala tiṭla kiṁta ravvaseyam̐ dagavā
(||kāmi||)
vĕlam̐dinavvula vĕnnĕlalu gāsī nībai
sĕluvum̐ḍa sittānam̐ jīm̐kaḍelayyā
muluvām̐ḍigŏnagoru mobinayaṁdu kemāya
valabu liṁtesi nīgu vaḍim̐ bĕṭṭam̐dagunā
(||kāmi||)
vanidasĕmaḍalane vānalu guriyam̐gānu
vĕnagaḍiyalugalavĕṭṭa yelayya
vĕnugŏni pūbaṁtini veside naṁdugemāya
sanavulu nī viṁta saṁḍibĕṭṭam̐dagunā
(||kāmi||)
alamelmaṁga kām̐giḍa nāmaniyai vuṁḍam̐gānu
ala radim̐ daniyaniakkarelayya
pilisi śhrīveṁkaḍeśha pĕnam̐gidenemāya
mŏlagasiggu tappuḍe mūm̐ṭagaṭṭam̐dagunā