Kaamini nidhaanamai kalige neegu

కామిని నిధానమై కలిగె నీకు
Language

(॥పల్లవి॥)
కామిని నిధానమై కలిగె నీకు
నేమెల్లాఁ బొగడఁగా నీదివో బదుకు

(॥కామి॥)
మొగము చూచినవ్వి మొనగోరు దాఁకించి
చిగురుమోవితేనె చిమ్మిరేఁగఁగా
వొగరుమాట లాడి వొడివట్టితీసె నాపె
నెగడినజాణఁడవు నీదివో బదుకు

(॥కామి॥)
విరులదండ వేసి వేడుకతో సన్నసేసి
పరగ నీమీఁదటిపాటలు వాడి
పరిమళములు వూసి బలిమితోఁ బెనఁగె
నిరతినెరజాణవు నీదివో బదుకు

(॥కామి॥)
వీడెము చేతికిచ్చి వీఁపుమీఁదఁ జేయివేసి
వాడుదేరఁ గూడె నాపె వన్నెలు సేసి
యీడనె శ్రీవేంకటేశ యెనయించె నన్ను నీతో
నీడనుండే సుకించేవు నీదివో బదుకు

(||pallavi||)
kāmini nidhānamai kaligĕ nīgu
nemĕllām̐ bŏgaḍam̐gā nīdivo badugu

(||kāmi||)
mŏgamu sūsinavvi mŏnagoru dām̐kiṁchi
sigurumovidenĕ simmirem̐gam̐gā
vŏgarumāḍa lāḍi vŏḍivaṭṭidīsĕ nābĕ
nĕgaḍinajāṇam̐ḍavu nīdivo badugu

(||kāmi||)
viruladaṁḍa vesi veḍugado sannasesi
paraga nīmīm̐daḍibāḍalu vāḍi
parimaḽamulu vūsi balimidom̐ bĕnam̐gĕ
niradinĕrajāṇavu nīdivo badugu

(||kāmi||)
vīḍĕmu sedigichchi vīm̐pumīm̐dam̐ jeyivesi
vāḍuderam̐ gūḍĕ nābĕ vannĕlu sesi
yīḍanĕ śhrīveṁkaḍeśha yĕnayiṁchĕ nannu nīdo
nīḍanuṁḍe sugiṁchevu nīdivo badugu