Kaamini badu kidi kadalaaya

కామిని బతు కిది కతలాయ
Language

(॥పల్లవి॥)
కామిని బతు కిది కతలాయ
వేమరుఁ జూతువు విచ్చేయవయ్యా

(॥కామి॥)
వెడఁగు నిట్టూర్పులు విసరఁగ విసరఁగ
పడఁతినెన్నడుమె బయలాయ
చిడుముడి లోలోఁ జింతించఁ జింతించ
జడిగొను చెమటలు జలనిధులాయ

(॥కామి॥)
పొరిజవ్వనమునఁ బొరలఁగఁ బొరలఁగఁ
గరిమఁ దురుము చీఁకకట్లాయ
విరహపుఁగరాఁకలు వెడలఁగ వెడలఁగ
పరగినమనసే పాతాళమాయ

(॥కామి॥)
కలయఁ గోరికలు కదుమఁగఁగదుమఁగ
పులకలమొలకలు పోగాయ
యెలమిని శ్రీ వేంకటేశ నీవు సతి-
నొలసి కూడఁగా నొక్కమనసాయ

(||pallavi||)
kāmini badu kidi kadalāya
vemarum̐ jūduvu vichcheyavayyā

(||kāmi||)
vĕḍam̐gu niṭṭūrbulu visaram̐ga visaram̐ga
paḍam̐tinĕnnaḍumĕ bayalāya
siḍumuḍi lolom̐ jiṁtiṁcham̐ jiṁtiṁcha
jaḍigŏnu sĕmaḍalu jalanidhulāya

(||kāmi||)
pŏrijavvanamunam̐ bŏralam̐gam̐ bŏralam̐gam̐
garimam̐ durumu sīm̐kagaṭlāya
virahabum̐garām̐kalu vĕḍalam̐ga vĕḍalam̐ga
paraginamanase pādāḽamāya

(||kāmi||)
kalayam̐ gorigalu kadumam̐gam̐gadumam̐ga
pulagalamŏlagalu pogāya
yĕlamini śhrī veṁkaḍeśha nīvu sadi-
nŏlasi kūḍam̐gā nŏkkamanasāya