కాఁగిలించుకోవయ్యా కడుముద్దరాలు చెలి
(॥పల్లవి॥)
కాఁగిలించుకోవయ్యా కడుముద్దరాలు చెలి-
నీఁగరాని కోరికతో నివ్వెరగందీని
(॥కాఁగి॥)
పడఁతిచేత నీవు పాదా లొత్తించుకోఁగాను
వుడివోనివలపు నుమ్మగిలీని
అడియాస మెయిసోఁకు లటుగొంత చూపఁగాను
కడలేనితమకానఁ గరఁగీని మనసు
(॥కాఁగి॥)
కాంతచేత నీ వప్పటి గందము పూయించుకోఁగా
దొంతరపులకలను తోదోపులాడీ
వింత వింతనీమాఁటల వేడుక వుట్టించఁగాను
చెంత మదనకళలఁ జెలరేఁగించీ మొగము
(॥కాఁగి॥)
అలమేలుమంగను నీ వట్టు రతిఁ గూడఁగాను
పలచనిచెమటలఁ బచ్చిదేరీని
యెలమి శ్రీ వేంకటేవ యింతలోఁ జన వియ్యఁగా
సొలపులసంతోసానఁ జొక్కించీ మేను
(||pallavi||)
kām̐giliṁchugovayyā kaḍumuddarālu sĕli-
nīm̐garāni korigado nivvĕragaṁdīni
(||kām̐gi||)
paḍam̐tiseda nīvu pādā lŏttiṁchugom̐gānu
vuḍivonivalabu nummagilīni
aḍiyāsa mĕyisom̐ku laḍugŏṁta sūbam̐gānu
kaḍalenidamagānam̐ garam̐gīni manasu
(||kām̐gi||)
kāṁtaseda nī vappaḍi gaṁdamu pūyiṁchugom̐gā
dŏṁtarabulagalanu todobulāḍī
viṁta viṁtanīmām̐ṭala veḍuga vuṭṭiṁcham̐gānu
sĕṁta madanagaḽalam̐ jĕlarem̐giṁchī mŏgamu
(||kām̐gi||)
alamelumaṁganu nī vaṭṭu radim̐ gūḍam̐gānu
palasanisĕmaḍalam̐ bachchiderīni
yĕlami śhrī veṁkaḍeva yiṁtalom̐ jana viyyam̐gā
sŏlabulasaṁtosānam̐ jŏkkiṁchī menu