కాఁగిలించుకొని యెంత కదిమేవయ్య
(॥పల్లవి॥)
కాఁగిలించుకొని యెంత కదిమేవయ్య
చేఁగ దేర గోరికొనఁ జెనకకువయ్యా
(॥కాఁగి॥)
మొనసి నీ పాదాలకు మొక్కేమయ్య
ఘనుఁడవౌదువు అన్నీఁ గంటిమయ్య
పొనుఁగక యిట్టే నిన్నుఁ బొగడేమయ్య
పెనఁగను నాచన్నులు పిసుకకువయ్యా
(॥కాఁగి॥)
చెప్పినట్టు నీసేవ సేసేమయ్య
తప్పు వేసి సటలిఁకఁ దడవనయ్య
ముప్పిరి నీవారము మొదలే అయ్య
చప్పుడుగాను గిలిగించకు మిప్పుడయ్యా
(॥కాఁగి॥)
భావించి పంతమిచ్చితిఁ బాయకువయ్య
శ్రీవేంకటేశ తమ్మకుఁ జే చాఁచేనయ్యా
యీవేళ నన్నుఁ గూడితి విదే మేలయ్యా
కైవసమై మోవిగంటి గావించకువయ్యా
(||pallavi||)
kām̐giliṁchugŏni yĕṁta kadimevayya
sem̐ga dera gorigŏnam̐ jĕnagaguvayyā
(||kām̐gi||)
mŏnasi nī pādālagu mŏkkemayya
ghanum̐ḍavauduvu annīm̐ gaṁṭimayya
pŏnum̐gaga yiṭṭe ninnum̐ bŏgaḍemayya
pĕnam̐ganu nāsannulu pisugaguvayyā
(||kām̐gi||)
sĕppinaṭṭu nīseva sesemayya
tappu vesi saḍalim̐kam̐ daḍavanayya
muppiri nīvāramu mŏdale ayya
sappuḍugānu giligiṁchagu mippuḍayyā
(||kām̐gi||)
bhāviṁchi paṁtamichchidim̐ bāyaguvayya
śhrīveṁkaḍeśha tammagum̐ je sām̐senayyā
yīveḽa nannum̐ gūḍidi vide melayyā
kaivasamai movigaṁṭi gāviṁchaguvayyā