Kaamgilimchugonavalenaa kammadi ninnu

కాఁగిలించుకొనవలెనా కమ్మటి నిన్ను
Language

(॥పల్లవి॥)
కాఁగిలించుకొనవలెనా కమ్మటి నిన్ను
వీఁగక మాఁటాడితేనే వేడుకెల్లాఁ జెల్లెను

(॥కాగి॥)
కందువల నీవు నన్నుఁ గన్నులఁ జూచితేనే
అందరితోడివరుస లబ్బెను నాకు
చెంది నీవు వొకమాఁటు సెలవుల నవ్వితేనే
పొందినటువంటి రతిభోగములు నాయను

(॥కాగి॥)
చెనకి యొకమాఁటు నాచెక్కులు నీవు నొక్కితే
పనివడి సంసారఫల మబ్బెను
చనవున నిటువలె చదురంగమాడితేనే
తనువుమీఁది మదనతాపమెల్లా నారెను

(॥కాగి॥)
ఇచ్చగించ నావద్ద నేకతాన నీ వుండితే
నిచ్చకల్యాణము లిట్టే నెరవేరెను
యెచ్చరించి శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
అచ్చపుమనోరథము లన్నియు సిద్దించెను

(||pallavi||)
kām̐giliṁchugŏnavalĕnā kammaḍi ninnu
vīm̐gaga mām̐ṭāḍidene veḍugĕllām̐ jĕllĕnu

(||kāgi||)
kaṁduvala nīvu nannum̐ gannulam̐ jūsidene
aṁdaridoḍivarusa labbĕnu nāgu
sĕṁdi nīvu vŏgamām̐ṭu sĕlavula navvidene
pŏṁdinaḍuvaṁṭi radibhogamulu nāyanu

(||kāgi||)
sĕnagi yŏgamām̐ṭu nāsĕkkulu nīvu nŏkkide
panivaḍi saṁsāraphala mabbĕnu
sanavuna niḍuvalĕ saduraṁgamāḍidene
tanuvumīm̐di madanadābamĕllā nārĕnu

(||kāgi||)
ichchagiṁcha nāvadda negadāna nī vuṁḍide
nichchagalyāṇamu liṭṭe nĕraverĕnu
yĕchchariṁchi śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
achchabumanorathamu lanniyu siddiṁchĕnu