Kaamgilimchugonaraadaa gakkana nee ramanuni

కాఁగిలించుకొనరాదా గక్కన నీ రమణుని
Language

(॥పల్లవి॥)
కాఁగిలించుకొనరాదా గక్కన నీ రమణుని
మాఁగిన మీ వలపులు మాఁగఁబెట్ట నేలే

(॥కాఁగి॥)
శిరసుపై సేసలు చిందెను మీఁగాళ్లమీఁద
యిరవైన నీసిగ్గులు యెందాఁకానే
తెరమరఁగుమాఁటలు తేనెలై చెవులు సోఁకెఁ
నరగొరలేల మీకు నడ్డాలు మరేలే

(॥కాఁగి॥)
కన్నులఁ జూచినచూపు కాఁడుకొనె మనసెల్లా
యెన్న రానినీజాగు లెందాఁకానే
చన్నులపై పయ్యద జారించె నీపులకలు
మున్నిటిమీతమకము మూసి దాఁచనేలే

(॥కాఁగి॥)
పిక్కటిల్లి జవ్వనము పెండ్లిపీఁట యెక్కించె
యిక్కువ నీతలపోఁత లెందాఁకానే
చక్కని శ్రీవేంకటేశ్వరుఁడు నిన్నుఁ గూడెను
తక్కక పరవశపుతడఁబాలు లేలే

(||pallavi||)
kām̐giliṁchugŏnarādā gakkana nī ramaṇuni
mām̐gina mī valabulu mām̐gam̐bĕṭṭa nele

(||kām̐gi||)
śhirasubai sesalu siṁdĕnu mīm̐gāḽlamīm̐da
yiravaina nīsiggulu yĕṁdām̐kāne
tĕramaram̐gumām̐ṭalu tenĕlai sĕvulu som̐kĕm̐
naragŏralela mīgu naḍḍālu marele

(||kām̐gi||)
kannulam̐ jūsinasūbu kām̐ḍugŏnĕ manasĕllā
yĕnna rāninījāgu lĕṁdām̐kāne
sannulabai payyada jāriṁchĕ nībulagalu
munniḍimīdamagamu mūsi dām̐sanele

(||kām̐gi||)
pikkaḍilli javvanamu pĕṁḍlibīm̐ṭa yĕkkiṁchĕ
yikkuva nīdalabom̐ta lĕṁdām̐kāne
sakkani śhrīveṁkaḍeśhvarum̐ḍu ninnum̐ gūḍĕnu
takkaga paravaśhabudaḍam̐bālu lele