కాఁగిలించి పట్టుకోరే కల్లరి వీఁడు
(॥పల్లవి॥)
కాఁగిలించి పట్టుకోరే కల్లరి వీఁడు
మాఁగిన వెూవి చూపి మరిగించీ వీఁడు
(॥॥)
కోడెకాండ్లుఁ దాను కోలలెత్తుకొని
వాడవాడల నుట్లు వడిఁ గొట్టీని
వేడుక కాఁడమ్మ వెఁస గృష్ణుఁ డిటువంటి
జాడలు వద్దంటేను చన్నులంటీని
(॥॥)
వీదివీదిఁ బాలువెన్న వెఁస గొల్లలాడినాఁడు
ఆదెఁస జాడెలు నిండి అట్టెవున్నవి
పాడుకొని చక్కిలాలబాన విడువుమని
పాదులకు మొక్కితేను పయ్యద దెరచీని
(॥॥)
వోసరించక యిదివో వుట్లపండుగ సేసి
వేసరక పెక్కిండ్లవిందైనాఁడు
సేసవెట్టె నిందరిపై శ్రీ వెంకటాద్రిమీఁద
బాసతో నలమేల్ మంగపతియైనకృష్ణుఁడు
(||pallavi||)
kām̐giliṁchi paṭṭugore kallari vīm̐ḍu
mām̐gina vĕూvi sūbi marigiṁchī vīm̐ḍu
(||||)
koḍĕgāṁḍlum̐ dānu kolalĕttugŏni
vāḍavāḍala nuṭlu vaḍim̐ gŏṭṭīni
veḍuga kām̐ḍamma vĕm̐sa gṛṣhṇum̐ ḍiḍuvaṁṭi
jāḍalu vaddaṁṭenu sannulaṁṭīni
(||||)
vīdivīdim̐ bāluvĕnna vĕm̐sa gŏllalāḍinām̐ḍu
ādĕm̐sa jāḍĕlu niṁḍi aṭṭĕvunnavi
pāḍugŏni sakkilālabāna viḍuvumani
pādulagu mŏkkidenu payyada dĕrasīni
(||||)
vosariṁchaga yidivo vuṭlabaṁḍuga sesi
vesaraga pĕkkiṁḍlaviṁdainām̐ḍu
sesavĕṭṭĕ niṁdaribai śhrī vĕṁkaḍādrimīm̐da
bāsado nalamel maṁgabadiyainakṛṣhṇum̐ḍu