Kaamgilimchave yitte kanagagiriraayani

కాఁగిలించవే యిట్టే కనకగిరిరాయని
Language

(॥పల్లవి॥)
కాఁగిలించవే యిట్టే కనకగిరిరాయని
మాఁగిన మోవి యిచ్చీని మచ్చిక దైవారఁగా

(॥కాఁగి॥)
యెగ్గులేక పొందితేనే యింపెరఁగవచ్చుఁ గాక
సిగ్గుతోడ నుండితేను చెప్పేదేమి
దగ్గరఁ గూచుండితేను తమకము రేఁగుఁ గాక
వొగ్గి దవ్వుల నుండితే వొద్దిక చేకూరునా

(॥కాఁగి॥)
సరసములాడితేనే చవులెల్లాఁ బుట్టుఁ గాక
తెరవేసుకుండితేను తెలిపేదేమి
నిరతి నీవు నవ్వితే నిక్కుఁగాక మోహములు
పరవశమై వుండితే పంతాలొనగూడునా

(॥కాఁగి॥)
శ్రీవేంకటేశుఁ డితనిసేవే తగులు గాక
కావిరి నూరకుండితే కదిమేదేమి
యీవేళ నితని నిట్టే యెనసితి విదిగాక
రావాడి బింకాన నుంటే రతి సమకొనునా

(||pallavi||)
kām̐giliṁchave yiṭṭe kanagagirirāyani
mām̐gina movi yichchīni machchiga daivāram̐gā

(||kām̐gi||)
yĕggulega pŏṁdidene yiṁpĕram̐gavachchum̐ gāga
siggudoḍa nuṁḍidenu sĕppedemi
daggaram̐ gūsuṁḍidenu tamagamu rem̐gum̐ gāga
vŏggi davvula nuṁḍide vŏddiga segūrunā

(||kām̐gi||)
sarasamulāḍidene savulĕllām̐ buṭṭum̐ gāga
tĕravesuguṁḍidenu tĕlibedemi
niradi nīvu navvide nikkum̐gāga mohamulu
paravaśhamai vuṁḍide paṁtālŏnagūḍunā

(||kām̐gi||)
śhrīveṁkaḍeśhum̐ ḍidaniseve tagulu gāga
kāviri nūraguṁḍide kadimedemi
yīveḽa nidani niṭṭe yĕnasidi vidigāga
rāvāḍi biṁkāna nuṁṭe radi samagŏnunā