Kaamgilimchavayyaa kaamini neevu

కాఁగిలించవయ్యా కామిని నీవు
Language

(॥పల్లవి॥)
కాఁగిలించవయ్యా కామిని నీవు
మాఁగిన మోవితోడ మధురమై వున్నది

(॥కాఁగి॥)
యెలయింపుఁజూపులను ఇంతిఁజూచితే నాపెకు
చెలపచెమటనీరు చిమ్మిరేఁగెను
వెలయ నీవందుకుఁగా విసరితివి సురటి
పులక మొగ్గలమేనఁ బొదిగొనివున్నది

(॥కాఁగి॥)
మనసిచ్చి సతితోను మాటలు నీవాడితేను
చనుఁగవ బిగువెక్కి జారెఁ బయ్యద
అనువుగాఁ బెట్టఁబోతే నందుపై నీగోరు సోకి
మనసెల్లాఁ గరఁగి నీమంచముపై నున్నది

(॥కాఁగి॥)
దొమ్మి నలమేల్మంగతోడ నీవు నవ్వితేను
కుమ్మరింపుసిగ్గుతోడ కొప్పు వీడెను
నెమ్మది శ్రీవేంకటేశ నీవింతలోఁ గూడితేను
సమ్మతించి మెచ్చిమెచ్చి సారె నీకు మొక్కెను

(||pallavi||)
kām̐giliṁchavayyā kāmini nīvu
mām̐gina movidoḍa madhuramai vunnadi

(||kām̐gi||)
yĕlayiṁpum̐jūbulanu iṁtim̐jūside nābĕgu
sĕlabasĕmaḍanīru simmirem̐gĕnu
vĕlaya nīvaṁdugum̐gā visaridivi suraḍi
pulaga mŏggalamenam̐ bŏdigŏnivunnadi

(||kām̐gi||)
manasichchi sadidonu māḍalu nīvāḍidenu
sanum̐gava biguvĕkki jārĕm̐ bayyada
anuvugām̐ bĕṭṭam̐bode naṁdubai nīgoru sogi
manasĕllām̐ garam̐gi nīmaṁchamubai nunnadi

(||kām̐gi||)
dŏmmi nalamelmaṁgadoḍa nīvu navvidenu
kummariṁpusiggudoḍa kŏppu vīḍĕnu
nĕmmadi śhrīveṁkaḍeśha nīviṁtalom̐ gūḍidenu
sammadiṁchi mĕchchimĕchchi sārĕ nīgu mŏkkĕnu