(॥పల్లవి॥)
కామధేనువై కలిగె నీధరణి
వాములు వలసినవారికి విధులు
(॥కామ॥)
అందరు జీవులే ఆయాకర్మముఁ
బొంది బుద్ధు లెప్పుడు వేరు
కొందరు స్వర్గము గోరి సుఖింతురు
కొందరు నరకానఁ గూలుదురు
(॥కామ॥)
దేవుఁ డిందరికి దిక్కై యుండును
భావాభావమే బహువిధము
దేవత లమృతాధీనమై మనిరి
తోవనె దనుజులు దురిత మందిరి
(॥కామ॥)
పుట్టు గందరికి పొంచి కలిగినదె
దట్టపుమనసులే తమకొలఁది
యిట్టే శ్రీవేంకటేశుఁడు సేసిన
యట్లౌ నాతఁడు అదివో యెదుట
(||pallavi||)
kāmadhenuvai kaligĕ nīdharaṇi
vāmulu valasinavārigi vidhulu
(||kāma||)
aṁdaru jīvule āyāgarmamum̐
bŏṁdi buddhu lĕppuḍu veru
kŏṁdaru svargamu gori sukhiṁturu
kŏṁdaru naragānam̐ gūluduru
(||kāma||)
devum̐ ḍiṁdarigi dikkai yuṁḍunu
bhāvābhāvame bahuvidhamu
devada lamṛtādhīnamai maniri
tovanĕ danujulu durida maṁdiri
(||kāma||)
puṭṭu gaṁdarigi pŏṁchi kaliginadĕ
daṭṭabumanasule tamagŏlam̐di
yiṭṭe śhrīveṁkaḍeśhum̐ḍu sesina
yaṭlau nādam̐ḍu adivo yĕduḍa