Kaamaadurunagunu garva mekkudu

కామాతురునకును గర్వ మెక్కుడు
Language

(॥పల్లవి॥)
కామాతురునకును గర్వ మెక్కుడు
వేమారుఁ బెచ్చువెరిగి విఱ్ఱవీఁగు మిఁకను

(॥కామా॥)
నీకేల వెరపూ నీవిన్నిటా దొరవూ
చేకొని యేమి చేసినాఁ జెల్లును నేడు
యీకడనాకడ సతు లెందరైనా నున్నవారు
చేకొని మత్తుఁడవై చెలరేఁగు మిఁకను

(॥కామా॥)
అడ్డాఁక లేడవి అన్నిటాఁ దెగుదారివి
వొడ్డారాన నెట్టుండినా వొరపే నీకు
జడ్డుదేరె తమ్ములము సరి నీపుక్కిళ్ల నదె
దొడ్డగాఁ జొక్కుచు సోలి తుదమీరు మిఁకను

(॥కామా॥)
పండెను నీతపమూ పట్టినదెల్లాఁ బైఁడి
అండనే నన్నుఁ గూడితి వాయను పని
నిండఁగ శ్రీవేంకటాద్రినిధిఁ దొక్కివున్నాఁడవు
కొండవంటి వుబ్బుతోడఁ గొల్లగాను మిఁకను

(||pallavi||)
kāmādurunagunu garva mĕkkuḍu
vemārum̐ bĕchchuvĕrigi viṭravīm̐gu mim̐kanu

(||kāmā||)
nīgela vĕrabū nīvinniḍā dŏravū
segŏni yemi sesinām̐ jĕllunu neḍu
yīgaḍanāgaḍa sadu lĕṁdarainā nunnavāru
segŏni mattum̐ḍavai sĕlarem̐gu mim̐kanu

(||kāmā||)
aḍḍām̐ka leḍavi anniḍām̐ dĕgudārivi
vŏḍḍārāna nĕṭṭuṁḍinā vŏrabe nīgu
jaḍḍuderĕ tammulamu sari nībukkiḽla nadĕ
dŏḍḍagām̐ jŏkkusu soli tudamīru mim̐kanu

(||kāmā||)
paṁḍĕnu nīdabamū paṭṭinadĕllām̐ baim̐ḍi
aṁḍane nannum̐ gūḍidi vāyanu pani
niṁḍam̐ga śhrīveṁkaḍādrinidhim̐ dŏkkivunnām̐ḍavu
kŏṁḍavaṁṭi vubbudoḍam̐ gŏllagānu mim̐kanu