Kaalavisheshamo logamugadiyo sanmaargambula

కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబుల
Language

(॥పల్లవి॥)
కాలవిశేషమో లోకముగతియో సన్మార్గంబుల-
కీలువదలె సౌజన్యము కిందయిపోయినది

(॥కాల॥)
ఇందెక్కడిసంసారం, బేదెసఁ జూచిన ధర్మము
కందయినది, విజ్ఞానము కడకుఁ దొలంగినది,
గొందులు దరిఁబడె, శాంతము కొంచెంబాయ, వివేకము
మందుకు వెదకినఁ గానము మంచితనంపుఁబనులు

(॥కాల॥)
మఱి యిఁక నేఁటివిచారము, మాలిన్యంబైపోయిన_
వెఱుకలు, సంతోషమునకు నెడమే లేదాయ,
కొఱమాలెను నిజమంతయు, కొండలకేఁగెను సత్యము,
మఱఁగైపోయను వినుకులు, మతిమాలెను తెలివి

(॥కాల॥)
తమకిఁక నెక్కడిబ్రదుకులు, తడఁబడె నాచారంబులు,
సమమైపోయిన వప్పుడె జాతివిడంబములు,
తిమిరంబింతయుఁ బాపఁగఁ దిరువేంకటగిరిలక్ష్మీ-
రమణుఁడు గతిదప్పను కలరచనేమియు లేదు

(||pallavi||)
kālaviśheṣhamo logamugadiyo sanmārgaṁbula-
kīluvadalĕ saujanyamu kiṁdayiboyinadi

(||kāla||)
iṁdĕkkaḍisaṁsāraṁ, bedĕsam̐ jūsina dharmamu
kaṁdayinadi, vijñānamu kaḍagum̐ dŏlaṁginadi,
gŏṁdulu darim̐baḍĕ, śhāṁtamu kŏṁchĕṁbāya, vivegamu
maṁdugu vĕdaginam̐ gānamu maṁchidanaṁpum̐banulu

(||kāla||)
maṟi yim̐ka nem̐ṭivisāramu, mālinyaṁbaiboyina̮
vĕṟugalu, saṁtoṣhamunagu nĕḍame ledāya,
kŏṟamālĕnu nijamaṁtayu, kŏṁḍalagem̐gĕnu satyamu,
maṟam̐gaiboyanu vinugulu, madimālĕnu tĕlivi

(||kāla||)
tamagim̐ka nĕkkaḍibradugulu, taḍam̐baḍĕ nāsāraṁbulu,
samamaiboyina vappuḍĕ jādiviḍaṁbamulu,
timiraṁbiṁtayum̐ bābam̐gam̐ diruveṁkaḍagirilakṣhmī-
ramaṇum̐ḍu gadidappanu kalarasanemiyu ledu