కాలము లారునుఁ గలిగి నీకు నిదె
(॥పల్లవి॥)
కాలము లారునుఁ గలిగి నీకు నిదె
బాలకియందే పైపై నీకు
(॥కాం॥)
సతికొప్పువిరులు జలజల రాలిన
లతల వసంతకాలము నీకు
కతగా దనమై కాఁకలు చూపిన
అతి వేసవి కాల ముప్పుడే నీకు
(॥కాల॥)
కాఁగిటచెమటల కడు నినుఁ దడిపిన
కాఁగల తొలుకరికాలు మది
వీఁగనిచూపుల వెన్నెల చల్లిన
రాఁగినమతికి శరత్కాలంబు
(॥కాల॥)
లంచపుఁ బులకల లలన నీరతుల
కంచపు హేమంతకాల మది
యెంచఁగ శ్రీ వేంకటేశ వలపుసతి
వంచ శిశిరకాలవైభవ మాయ
(||pallavi||)
kālamu lārunum̐ galigi nīgu nidĕ
bālagiyaṁde paibai nīgu
(||kāṁ||)
sadigŏppuvirulu jalajala rālina
ladala vasaṁtagālamu nīgu
kadagā danamai kām̐kalu sūbina
adi vesavi kāla muppuḍe nīgu
(||kāla||)
kām̐giḍasĕmaḍala kaḍu ninum̐ daḍibina
kām̐gala tŏlugarigālu madi
vīm̐ganisūbula vĕnnĕla sallina
rām̐ginamadigi śharatkālaṁbu
(||kāla||)
laṁchabum̐ bulagala lalana nīradula
kaṁchabu hemaṁtagāla madi
yĕṁcham̐ga śhrī veṁkaḍeśha valabusadi
vaṁcha śhiśhiragālavaibhava māya