కాలము కాలముగాదు కపటాలే తఱచాయ
(॥పల్లవి॥)
కాలము కాలముగాదు కపటాలే తఱచాయ
చాలునింక దీనితోడీ జాలి మానరే
(॥కాల॥)
పిన్ననాట నుండి తనపెంచిన యీదేహము
మున్నిటివలెగాదు ముదిసీని
యెన్నికదినాలచేత నెప్పుడేడఁ బడునో
కన్నవారిచేతికి గక్కున నియ్యరే
(॥కాల॥)
తోలునెముకలచేత దొడ్డైన యాదేహము
గాలిచేత దాలిమీఁదఁ గాగీని
కీలుగీలు యెప్పుడేడ కింద వీడిపడునో
మేలుఁగీడు లేనిచోట మేఁటిఁజేసి పెట్టరే
(॥కాల॥)
కింకపుకిసరుచేత కీడైన దేహము
వంకవంకతెరవుల వడీసీని
యింక నీవిధిచేత నెప్పుడేడఁ బడునో
వేంకటేశుఁజేరఁ బడవేయఁగదరే
(||pallavi||)
kālamu kālamugādu kabaḍāle taṟasāya
sāluniṁka dīnidoḍī jāli mānare
(||kāla||)
pinnanāḍa nuṁḍi tanabĕṁchina yīdehamu
munniḍivalĕgādu mudisīni
yĕnnigadinālaseda nĕppuḍeḍam̐ baḍuno
kannavārisedigi gakkuna niyyare
(||kāla||)
tolunĕmugalaseda dŏḍḍaina yādehamu
gāliseda dālimīm̐dam̐ gāgīni
kīlugīlu yĕppuḍeḍa kiṁda vīḍibaḍuno
melum̐gīḍu lenisoḍa mem̐ṭim̐jesi pĕṭṭare
(||kāla||)
kiṁkabugisaruseda kīḍaina dehamu
vaṁkavaṁkadĕravula vaḍīsīni
yiṁka nīvidhiseda nĕppuḍeḍam̐ baḍuno
veṁkaḍeśhum̐jeram̐ baḍaveyam̐gadare