Kaalamamde nee daasulai kadu dheerulauda gaaga

కాలమందే నీ దాసులై కడు ధీరులౌట గాక
Language

(॥పల్లవి॥)
కాలమందే నీ దాసులై కడు ధీరులౌట గాక
యీలాగున మోసపోతి నేమిటా నే మున్నది

(॥కాల॥)
పొనిఁగి యింద్రునినై నాఁ బోనీదు కోపము
మునుకొని రుద్రునైనా ముంచుఁ గోపము
వెనుకొని బ్రహ్మనైనా విడువదు కోపము
మనికియైన దేవత్వమహిమ యే మున్నది

(॥కాల॥)
వడి విశ్వామిత్రునంతవానికి రేఁగెఁ గోపము
కెడపి దుర్వాసునిఁ జక్కించెఁ గోపము
యెడనెడ మునులను యేమరించుఁ గోపము
బడిఁ దపనుల బల్మి పలుక నే మున్నది

(॥కాల॥)
కచ్చు పెట్టి ధర్మజునిఁ గనలించెఁ గోపము
కొచ్చి కార్తవీర్యుఁ బురికొల్పెఁ గోపము
నిచ్చలు శ్రీవేంకటేశ నీవే శాంత మిచ్చితి గా
కిచ్చల రాజ్యపదవి యెంచ నే మున్నది

(||pallavi||)
kālamaṁde nī dāsulai kaḍu dhīrulauḍa gāga
yīlāguna mosabodi nemiḍā ne munnadi

(||kāla||)
pŏnim̐gi yiṁdruninai nām̐ bonīdu kobamu
munugŏni rudrunainā muṁchum̐ gobamu
vĕnugŏni brahmanainā viḍuvadu kobamu
manigiyaina devatvamahima ye munnadi

(||kāla||)
vaḍi viśhvāmitrunaṁtavānigi rem̐gĕm̐ gobamu
kĕḍabi durvāsunim̐ jakkiṁchĕm̐ gobamu
yĕḍanĕḍa munulanu yemariṁchum̐ gobamu
baḍim̐ dabanula balmi paluga ne munnadi

(||kāla||)
kachchu pĕṭṭi dharmajunim̐ ganaliṁchĕm̐ gobamu
kŏchchi kārdavīryum̐ burigŏlbĕm̐ gobamu
nichchalu śhrīveṁkaḍeśha nīve śhāṁta michchidi gā
kichchala rājyabadavi yĕṁcha ne munnadi