కాకున నేఁ బొరలితి కాతరాన బడలితి
(॥పల్లవి॥)
కాకున నేఁ బొరలితి కాతరాన బడలితి
నీకు మొక్కే నాకు బుద్ది నేరుపఁగఁ గలవా
(॥॥)
అడ్డమాడఁ జాలను అవుఁగాదనఁ జాలను
దొడ్డదొరవు నీమాట తోయఁ జాలను
వెడ్డువెట్టి తొల్లి నీవే వేసాలు నేర్పితివి
యెడ్డతన మిఁక నాకు నెట్టు మానిపేవు
(॥॥)
మనసులోదానను మచ్చికైన దానను
ఘనుఁడవు నీతో నేను గయ్యాళించను
చనవిచ్చి అన్నింటాను చవులుమరపితివి
యెనలేక నన్ను నెట్టు యీడేర్చేవో
(॥॥)
వేవేలకు దూర నేను వేడుక చెల్లింతు నేను
శ్రీ వేంకటేశుఁడవు చెలఁగింతును
వావులు దెలిపి నాఁడే వలపులు చల్లితివి
కైవసమై నన్ను నెట్టు గరుణించేవో
(||pallavi||)
kāguna nem̐ bŏralidi kādarāna baḍalidi
nīgu mŏkke nāgu buddi nerubam̐gam̐ galavā
(||||)
aḍḍamāḍam̐ jālanu avum̐gādanam̐ jālanu
dŏḍḍadŏravu nīmāḍa toyam̐ jālanu
vĕḍḍuvĕṭṭi tŏlli nīve vesālu nerbidivi
yĕḍḍadana mim̐ka nāgu nĕṭṭu mānibevu
(||||)
manasulodānanu machchigaina dānanu
ghanum̐ḍavu nīdo nenu gayyāḽiṁchanu
sanavichchi anniṁṭānu savulumarabidivi
yĕnalega nannu nĕṭṭu yīḍersevo
(||||)
vevelagu dūra nenu veḍuga sĕlliṁtu nenu
śhrī veṁkaḍeśhum̐ḍavu sĕlam̐giṁtunu
vāvulu dĕlibi nām̐ḍe valabulu sallidivi
kaivasamai nannu nĕṭṭu garuṇiṁchevo