కాకుండితే రమణుఁడ కాఁతాళములు రేఁగు
(॥పల్లవి॥)
కాకుండితే రమణుఁడ కాఁతాళములు రేఁగు
పైకొన్నమాటతోడ పంతమెల్లా దక్కెను
(॥కాకుం॥)
వుల్లసముగా నాడినవొడ్డారపునీమాట
చల్లనినవ్వుమాటతో శాంతమాయను
కల్లలుగా నాడినకారపువెంగెపుమాట
తెల్లమై ఆసమాటతో తియ్యనాయను
(॥కాకుం॥)
వూరకె నీవాడిన వుప్పనైననీమాట
సారపుముద్దుమాటతో చవి వుట్టెను
జారువడ నాడినట్టిచప్పనైననీమాట
పేరుకొన్న మాటతోడఁ బ్రియమాయను
(॥కాకుం॥)
కప్పురపు వెసురుకాఁగిటిలో తిట్టుమాఁట
వొప్పినసమ్మతి మాఁట నొచ్చెము దీరె
యిప్పుడే శ్రీవేంకటేశ యెనసినపచ్చిమాఁట
తప్పినినీమాఁటతోడ తనివి నాకాయను
(||pallavi||)
kāguṁḍide ramaṇum̐ḍa kām̐tāḽamulu rem̐gu
paigŏnnamāḍadoḍa paṁtamĕllā dakkĕnu
(||kāguṁ||)
vullasamugā nāḍinavŏḍḍārabunīmāḍa
sallaninavvumāḍado śhāṁtamāyanu
kallalugā nāḍinagārabuvĕṁgĕbumāḍa
tĕllamai āsamāḍado tiyyanāyanu
(||kāguṁ||)
vūragĕ nīvāḍina vuppanainanīmāḍa
sārabumuddumāḍado savi vuṭṭĕnu
jāruvaḍa nāḍinaṭṭisappanainanīmāḍa
perugŏnna māḍadoḍam̐ briyamāyanu
(||kāguṁ||)
kappurabu vĕsurugām̐giḍilo tiṭṭumām̐ṭa
vŏppinasammadi mām̐ṭa nŏchchĕmu dīrĕ
yippuḍe śhrīveṁkaḍeśha yĕnasinabachchimām̐ṭa
tappininīmām̐ṭadoḍa tanivi nāgāyanu