Kaagibegada sheeranu kaasha vosinaamdu taanu

కాకిబెగడ శీరను కాశ వోసినాఁడు తాను
Language

(॥పల్లవి॥)
కాకిబెగడ శీరను కాశ వోసినాఁడు తాను
వాకిటికి వచ్చినాఁడు వలశితి ననవే

(॥కాకి॥)
పచ్చనిసాపమీఁదఁ బవళించు మనవే
కుచ్చి మాసూపులు దన్ను గురి దాఁకెను
చెచ్చెరఁ బారుటాకుల చెంచవార మనవే
తెచ్చేను మా దొండపంటితేనె లిదే అనవే

(॥కాకి॥)
కొండపడ మేడలలోఁ గూరుసుండు మనవే
నిండునెమలిగరులు నెత్తి కెక్కెను
దిండు మా వెలఁగపండ్లు తీపు లెక్కె ననవే
అండనె వుందాన తన కప్పగించే ననవే

(॥కాకి॥)
కొప్పుల మొలల సే కుప్పవడె ననవే
కప్పురపు తనతమ్మ కార మనవే
వొప్పుగా శ్రీవెంకటేశుఁ డొనగూడె ననవే
ముప్పిరి నేమీ నెఱఁగ మొక్కితి నే ననవే

(||pallavi||)
kāgibĕgaḍa śhīranu kāśha vosinām̐ḍu tānu
vāgiḍigi vachchinām̐ḍu valaśhidi nanave

(||kāgi||)
pachchanisābamīm̐dam̐ bavaḽiṁchu manave
kuchchi māsūbulu dannu guri dām̐kĕnu
sĕchchĕram̐ bāruḍāgula sĕṁchavāra manave
tĕchchenu mā dŏṁḍabaṁṭidenĕ lide anave

(||kāgi||)
kŏṁḍabaḍa meḍalalom̐ gūrusuṁḍu manave
niṁḍunĕmaligarulu nĕtti kĕkkĕnu
diṁḍu mā vĕlam̐gabaṁḍlu tību lĕkkĕ nanave
aṁḍanĕ vuṁdāna tana kappagiṁche nanave

(||kāgi||)
kŏppula mŏlala se kuppavaḍĕ nanave
kappurabu tanadamma kāra manave
vŏppugā śhrīvĕṁkaḍeśhum̐ ḍŏnagūḍĕ nanave
muppiri nemī nĕṟam̐ga mŏkkidi ne nanave