Kaaga mari yimtela kalugum damage tamagu

కాక మరి యింతేల కలుగుఁ దమకే తమకు
Language

(॥పల్లవి॥)
కాక మరి యింతేల కలుగుఁ దమకే తమకు
చేకొన్న కోరికలు చేరునందాఁకా

(॥కాక॥)
దొరతనములన్నియును దొరసి నందాఁకా
నెరతనములన్నియును నెరపి నందాఁకా
గరగరికలన్నియును కలసి నందాఁకా
విరసంబులన్నియును విసుగు నందాఁకా

(॥కాక॥)
యెడమాటలన్నియును యెరసి నందాఁకా
అడియాసకోరికలు అదుకు నందాఁకా
జడిగొన్నగుక్కిళ్లు చవిగొన్నయందాఁక
వొడ లోముటలు మోహ ముడుగు నందాఁకా

(॥కాక॥)
యీ వెల్లఁ దమయాత్మ యిచ్చగించినదాఁక
శ్రీవేంకటేశుకృప చేరు నందాఁక
లోవెలుతున్నియును లోఁగొన్నయందాఁక
వేవేగ బంధములు వీడు నందాఁకా

(||pallavi||)
kāga mari yiṁtela kalugum̐ damage tamagu
segŏnna korigalu serunaṁdām̐kā

(||kāga||)
dŏradanamulanniyunu dŏrasi naṁdām̐kā
nĕradanamulanniyunu nĕrabi naṁdām̐kā
garagarigalanniyunu kalasi naṁdām̐kā
virasaṁbulanniyunu visugu naṁdām̐kā

(||kāga||)
yĕḍamāḍalanniyunu yĕrasi naṁdām̐kā
aḍiyāsagorigalu adugu naṁdām̐kā
jaḍigŏnnagukkiḽlu savigŏnnayaṁdām̐ka
vŏḍa lomuḍalu moha muḍugu naṁdām̐kā

(||kāga||)
yī vĕllam̐ damayātma yichchagiṁchinadām̐ka
śhrīveṁkaḍeśhukṛpa seru naṁdām̐ka
lovĕludunniyunu lom̐gŏnnayaṁdām̐ka
vevega baṁdhamulu vīḍu naṁdām̐kā