Kaadu vivegamu yidi kaadu yavivegamu

కాదు వివేకము యిది కాదు యవివేకము
Language

(॥పల్లవి॥)
కాదు వివేకము యిది కాదు యవివేకము
సోదించి నీకు శరణు చొరవలెఁ గాని

(॥కాదు॥)
కందువఁ దొల్లిటి జన్మకథ యేమి నెఱుఁగఁడు
ముందరిజన్మమునకు ముంచి పుణ్యము సేసును
యిందేమి గనెనో దేహి యెవ్వరి నమ్మెనో తాను
సందడి భోగములలో సాములు సేసీని

(॥కాదు॥)
గరిమ భూమండలము కడపల గానఁడు
పరము గావలెనని పాట్లఁబడి దేహి
యిరవు దనకు నేదో యెఱిఁగిన యెఱుకేదో
పరగిన యాసలకే పట్టి పెనఁగీని

(॥కాదు॥)
తగ నిదరించేవేళ తన స్వతంత్రము లేదు
మిగులా నుద్యోగించు మేలుకొనేవేళ
నిగిడి శ్రీవేంకటేశ నీ వంతరాత్మ వనక
వెగటుఁ జదువులలో వెదకఁ జూచీని

(||pallavi||)
kādu vivegamu yidi kādu yavivegamu
sodiṁchi nīgu śharaṇu sŏravalĕm̐ gāni

(||kādu||)
kaṁduvam̐ dŏlliḍi janmagatha yemi nĕṟum̐gam̐ḍu
muṁdarijanmamunagu muṁchi puṇyamu sesunu
yiṁdemi ganĕno dehi yĕvvari nammĕno tānu
saṁdaḍi bhogamulalo sāmulu sesīni

(||kādu||)
garima bhūmaṁḍalamu kaḍabala gānam̐ḍu
paramu gāvalĕnani pāṭlam̐baḍi dehi
yiravu danagu nedo yĕṟim̐gina yĕṟugedo
paragina yāsalage paṭṭi pĕnam̐gīni

(||kādu||)
taga nidariṁcheveḽa tana svadaṁtramu ledu
migulā nudyogiṁchu melugŏneveḽa
nigiḍi śhrīveṁkaḍeśha nī vaṁtarātma vanaga
vĕgaḍum̐ jaduvulalo vĕdagam̐ jūsīni