Kaadu goodadamtimaa kammadi needo nemu

కాదు గూడదంటిమా కమ్మటి నీతో నేము
Language

(॥పల్లవి॥)
కాదు గూడదంటిమా కమ్మటి నీతో నేము
పోదిసేసి నీకు నీవే పొదిగేవు గాక

(॥॥)
పంతమాడేమా నీతో బలుములు చూపేమా
వింతవారమా నేము వేగినంతాను
యెంతేసి వేఁడుకొనేవు ఇక్కువలేలంటేవు
కాంతల నేలంపేవు కమ్మటి మాయింటికి

(॥॥)
యేడనుంటి వంటిమా యెగ్గులు వట్టితిమా
వీడె మియ్యకుండితిమా వేగినంతాను
వోడకేల కొసరేవు వొడివట్టేల తీసేవు
అడకే లేకలువాసి అంపేవేల ఇంటికి

(॥॥)
సేవ సేయకుండితిమా శ్రీవేంకటేశ్వర నీకు
వేవేల రతులందమా వేగినంతాను
పూవుల నేల వేసేవు పొంచి యేల నవ్వించేవు
ఆవటించి వచ్చేవు నీవప్పటి మాయింటికి

(||pallavi||)
kādu gūḍadaṁṭimā kammaḍi nīdo nemu
podisesi nīgu nīve pŏdigevu gāga

(||||)
paṁtamāḍemā nīdo balumulu sūbemā
viṁtavāramā nemu veginaṁtānu
yĕṁtesi vem̐ḍugŏnevu ikkuvalelaṁṭevu
kāṁtala nelaṁpevu kammaḍi māyiṁṭigi

(||||)
yeḍanuṁṭi vaṁṭimā yĕggulu vaṭṭidimā
vīḍĕ miyyaguṁḍidimā veginaṁtānu
voḍagela kŏsarevu vŏḍivaṭṭela tīsevu
aḍage legaluvāsi aṁpevela iṁṭigi

(||||)
seva seyaguṁḍidimā śhrīveṁkaḍeśhvara nīgu
vevela radulaṁdamā veginaṁtānu
pūvula nela vesevu pŏṁchi yela navviṁchevu
āvaḍiṁchi vachchevu nīvappaḍi māyiṁṭigi