Kaadu gooda danaraadu kammadi neegu

కాదు గూడ దనరాదు కమ్మటి నీకు
Language

(॥పల్లవి॥)
కాదు గూడ దనరాదు కమ్మటి నీకు
ఆదిగొని రతి నిన్నే ఆయము లంటుదురు

(॥కాదు॥)
చనవు గలిగినాపె సణఁగులు రాల్చితే
ననవు గలిగినాపె నవ్వఁ జూచును
వొనర నీవిద్దరిని వొక్కటి సేయఁ జూచితే
వెనుకొని నిన్నే తాను వెంగెము లాడుదురు

(॥కాదు॥)
సేసపెండ్లికూఁతురు చేతులు చాఁచితేను
ఆసవడ్డ పెండ్లికూఁతు రడ్డాలు దొచ్చు
వేసరక యిరుమేలా వెస నీవు గైకొంటే
తాసువలె నీతోనే పంతాలు నెరపుదురు

(॥కాదు॥)
భూసతి నీసేవ సేసి బుజముపై నెక్కితేను
శ్రీ సతి నీవురము మచ్చిక నెక్కెను
ఆసల శ్రీ వేంకటేశ ఆపె నీపై నేలితివి
మోసపోక తాము నీపై మోము చల్లుదురు

(||pallavi||)
kādu gūḍa danarādu kammaḍi nīgu
ādigŏni radi ninne āyamu laṁṭuduru

(||kādu||)
sanavu galiginābĕ saṇam̐gulu rālside
nanavu galiginābĕ navvam̐ jūsunu
vŏnara nīviddarini vŏkkaḍi seyam̐ jūside
vĕnugŏni ninne tānu vĕṁgĕmu lāḍuduru

(||kādu||)
sesabĕṁḍligūm̐turu sedulu sām̐sidenu
āsavaḍḍa pĕṁḍligūm̐tu raḍḍālu dŏchchu
vesaraga yirumelā vĕsa nīvu gaigŏṁṭe
tāsuvalĕ nīdone paṁtālu nĕrabuduru

(||kādu||)
bhūsadi nīseva sesi bujamubai nĕkkidenu
śhrī sadi nīvuramu machchiga nĕkkĕnu
āsala śhrī veṁkaḍeśha ābĕ nībai nelidivi
mosaboga tāmu nībai momu salluduru