కాతరపువాఁడవు గజరు నీకుఁ బట్టితే
(॥పల్లవి॥)
కాతరపువాఁడవు గజరు నీకుఁ బట్టితే
నీతి యెఱిఁగినదాన నిన్నుఁ గాదనేనా
(॥కాతర॥)
చనవరికాంతతో సరసము లాడఁగాను
కొనమాట లందుకొనే కూళాఁ గద్దా
వినేటి విభుఁడవు వివరించుకో కుండితే
పనియెఱిఁగినదాన పలికేనా నేను
(॥కాతర॥)
మెఱసి వరుసకున మెలుఁత గాచుకుండఁగా
యెఱుకలు సేసుకొనే యెడ్డాఁ గద్దా
మొఱఁగుల మగఁడవు ముంద రెంచకుండితేను
వఱటులు వట్టేదాన వొరసేనా నేను
(॥కాతర॥)
నిన్నుఁ గూడినచెలి నివ్వెఱఁగుతో నుండఁగా
కన్నుమొఱఁగి కలిసే గబ్బీఁ గద్దా
నన్నుఁ గూడి శ్రీవేంకటనాయక నీవు నవ్వితే
మన్నింపించుకొన్నదాన మఱచేనా నేను
(||pallavi||)
kādarabuvām̐ḍavu gajaru nīgum̐ baṭṭide
nīdi yĕṟim̐ginadāna ninnum̐ gādanenā
(||kādara||)
sanavarigāṁtado sarasamu lāḍam̐gānu
kŏnamāḍa laṁdugŏne kūḽām̐ gaddā
vineḍi vibhum̐ḍavu vivariṁchugo kuṁḍide
paniyĕṟim̐ginadāna paligenā nenu
(||kādara||)
mĕṟasi varusaguna mĕlum̐ta gāsuguṁḍam̐gā
yĕṟugalu sesugŏne yĕḍḍām̐ gaddā
mŏṟam̐gula magam̐ḍavu muṁda rĕṁchaguṁḍidenu
vaṟaḍulu vaṭṭedāna vŏrasenā nenu
(||kādara||)
ninnum̐ gūḍinasĕli nivvĕṟam̐gudo nuṁḍam̐gā
kannumŏṟam̐gi kalise gabbīm̐ gaddā
nannum̐ gūḍi śhrīveṁkaḍanāyaga nīvu navvide
manniṁpiṁchugŏnnadāna maṟasenā nenu