కాదని వేరే సేయఁగలవాఁడా తాను
(॥పల్లవి॥)
కాదని వేరే సేయఁగలవాఁడా తాను
సాదువలె నుండుఁ గాక స్వతంత్రుఁడా తాను
(॥కాదని॥)
దైవము పై భారము తనపైఁ బెట్టు కోనేల
మోవలేక సంసారాన ములుగనేల
జీవుఁడై పుట్టితే నేమి శ్రీపతి నీవాఁడ నని
సేవ సేయుచుండఁగానే చేరి కాచీ నతఁడే
(॥కాదని॥)
యేలిక గూచుండే గద్దె యెక్కఁ దన కది యేల
వీలి అపరాథనకు వెఱవ నేల
ఆలు బిడ్డలకు గుఱి యవుటకు హరిఁజేరి
కాలము గోరుకుండఁగ కరుణించీ నతఁడే
(॥కాదని॥)
శ్రీ వేంకటేశు మాయకు చేరి యడ్డాలు రానేల
తోవ గానక యాతని దూఱఁగ నేల
శ్రీవైష్ణువుఁ డవుటకు చిత్తములో విష్ణు నమ్మి
భావించు కొనఁగా దయ పాలించీ నతఁడే
(||pallavi||)
kādani vere seyam̐galavām̐ḍā tānu
sāduvalĕ nuṁḍum̐ gāga svadaṁtrum̐ḍā tānu
(||kādani||)
daivamu pai bhāramu tanabaim̐ bĕṭṭu konela
movalega saṁsārāna muluganela
jīvum̐ḍai puṭṭide nemi śhrībadi nīvām̐ḍa nani
seva seyusuṁḍam̐gāne seri kāsī nadam̐ḍe
(||kādani||)
yeliga gūsuṁḍe gaddĕ yĕkkam̐ dana kadi yela
vīli abarāthanagu vĕṟava nela
ālu biḍḍalagu guṟi yavuḍagu harim̐jeri
kālamu goruguṁḍam̐ga karuṇiṁchī nadam̐ḍe
(||kādani||)
śhrī veṁkaḍeśhu māyagu seri yaḍḍālu rānela
tova gānaga yādani dūṟam̐ga nela
śhrīvaiṣhṇuvum̐ ḍavuḍagu sittamulo viṣhṇu nammi
bhāviṁchu kŏnam̐gā daya pāliṁchī nadam̐ḍe