Kaadani vaadimpa noba kalamga noba

కాదని వాదింప నోప కలఁగ నోప
Language

(॥పల్లవి॥)
కాదని వాదింప నోప కలఁగ నోప
శ్రీదేవుఁడ నీవే దిక్కయి చేకొంటేఁ జాలును

(॥కాదని॥)
వరుస నా నాగతులు వారివారి జ్ఞానములు
యిరవైన గురుతు నీ విం దొక్కఁడవే
పరగఁ జదువు లైతే బహువిధమతములు
నిరతి భక్తి యొక్కటే నిన్ను సాధించేది

(॥కాదని॥)
తలఁపఁ బెక్కు మూర్తులు ధ్యానము సేసేవారికి
ఫల మిచ్చేయట్టి నీ భావ మొక్కటే
పలుదెఱఁగులై యుండు భజించేటి భజనలు
తలకొని నీవు మెచ్చే దయ వొక్కటే

(॥కాదని॥)
పాటించ సేయఁబోతే తపము లెన్నేఁ గలవు
చాటి రక్షించేడి నీ దాస్యం బొక్కటే
గాటపు శ్రీవేంకటేశ కల వన్ని వుపాయాలు
నీటున నాకై తేను నీ శ్రీపాదములే

(||pallavi||)
kādani vādiṁpa noba kalam̐ga noba
śhrīdevum̐ḍa nīve dikkayi segŏṁṭem̐ jālunu

(||kādani||)
varusa nā nāgadulu vārivāri jñānamulu
yiravaina gurudu nī viṁ dŏkkam̐ḍave
paragam̐ jaduvu laide bahuvidhamadamulu
niradi bhakti yŏkkaḍe ninnu sādhiṁchedi

(||kādani||)
talam̐pam̐ bĕkku mūrdulu dhyānamu sesevārigi
phala michcheyaṭṭi nī bhāva mŏkkaḍe
paludĕṟam̐gulai yuṁḍu bhajiṁcheḍi bhajanalu
talagŏni nīvu mĕchche daya vŏkkaḍe

(||kādani||)
pāḍiṁcha seyam̐bode tabamu lĕnnem̐ galavu
sāḍi rakṣhiṁcheḍi nī dāsyaṁ bŏkkaḍe
gāḍabu śhrīveṁkaḍeśha kala vanni vubāyālu
nīḍuna nāgai tenu nī śhrībādamule