Kaadani tolamgaraadu karunimcham baadi neegu

కాదని తొలఁగరాదు కరుణించఁ బాడి నీకు
Language

(॥పల్లవి॥)
కాదని తొలఁగరాదు కరుణించఁ బాడి నీకు
వేదములు చాటి చెప్పే విశ్వవ్యాపకుఁడవు

(॥కాదని॥)
కాచేనన్న చరమశ్లోకము నాకుఁ బూఁట కాఁపు
చూచి నీ వేడనుండినాఁ జూపి ఇచ్చీని
కాచి నమ్మించే యభయకరమే నాకుఁ బూఁటకాఁవు
యేచిన నాలోని భయ మెల్లాఁ దేర్చీని

(॥కాదని॥)
నీవు నన్నుఁ బుట్టించిన నిమిత్తమే పూఁటకాఁపు
పోవక రక్షించు మని బుద్ధి చెప్పీని
దేవుఁడవై నిలిచిన నీ దీమసమే పూఁటకాఁపు
కేవలమై బిరుదు లెక్కించి రక్షింపించీని

(॥కాదని॥)
పోనీక నీ బంట్లు చెప్పే బోధే నాకు పూఁటకాఁపు
యే నెపాన నైనా నిన్ను యింటఁ బెట్టీని
వూని శ్రీవేంకటేశ్వర పూఁటకాఁపు లిందరును
వీనులతో నీకుఁ దామే విన్నవించేరు

(||pallavi||)
kādani tŏlam̐garādu karuṇiṁcham̐ bāḍi nīgu
vedamulu sāḍi sĕppe viśhvavyābagum̐ḍavu

(||kādani||)
kāsenanna saramaśhlogamu nāgum̐ būm̐ṭa kām̐pu
sūsi nī veḍanuṁḍinām̐ jūbi ichchīni
kāsi nammiṁche yabhayagarame nāgum̐ būm̐ṭagām̐vu
yesina nāloni bhaya mĕllām̐ dersīni

(||kādani||)
nīvu nannum̐ buṭṭiṁchina nimittame pūm̐ṭagām̐pu
povaga rakṣhiṁchu mani buddhi sĕppīni
devum̐ḍavai nilisina nī dīmasame pūm̐ṭagām̐pu
kevalamai birudu lĕkkiṁchi rakṣhiṁpiṁchīni

(||kādani||)
ponīga nī baṁṭlu sĕppe bodhe nāgu pūm̐ṭagām̐pu
ye nĕbāna nainā ninnu yiṁṭam̐ bĕṭṭīni
vūni śhrīveṁkaḍeśhvara pūm̐ṭagām̐pu liṁdarunu
vīnulado nīgum̐ dāme vinnaviṁcheru