(॥పల్లవి॥)
కాదనేనా నీమాట కానీ లేవే
నా దెసేమి చూచేవు నవ్వేఁ గానీ లేవే
(॥కాదనేనా॥)
నమ్మించి నీవు వానినయగారాలు చెప్పఁగ
కమ్మి నామై కాఁక రేఁగె కానీ లేవే
నెమ్మది వాని నిజాలు నీవు గల్లలాడే వటే
అమ్మరో ఆన వెట్టకు మట్టె కానీ లేవే
(॥కా దనేనా॥)
పిలిచీ ననుచు వాని ప్రియము నీవు చెప్పఁగ
కలిగెఁ బెద్దరికము కానీ లేవే
నెల వై వానిచేఁతలు నీవు నాకు దాఁచే వటే
అలుక లన్నియుఁ దీరె నట్టె కానీ లేవే
(॥కాదనేనా॥)
శ్రీవెంకటేశ్వరుని చేతికి నీ వియ్యఁగాను
కైవస మయితి నట్టె కానీ లేవే
నీవల్లనే కాదా నే మిద్దర మొక్క టైతి
మావటించి యిఁకఁ బాయ మట్టె కానీ లేవే
(||pallavi||)
kādanenā nīmāḍa kānī leve
nā dĕsemi sūsevu navvem̐ gānī leve
(||kādanenā||)
nammiṁchi nīvu vāninayagārālu sĕppam̐ga
kammi nāmai kām̐ka rem̐gĕ kānī leve
nĕmmadi vāni nijālu nīvu gallalāḍe vaḍe
ammaro āna vĕṭṭagu maṭṭĕ kānī leve
(||kā danenā||)
pilisī nanusu vāni priyamu nīvu sĕppam̐ga
kaligĕm̐ bĕddarigamu kānī leve
nĕla vai vānisem̐talu nīvu nāgu dām̐se vaḍe
aluga lanniyum̐ dīrĕ naṭṭĕ kānī leve
(||kādanenā||)
śhrīvĕṁkaḍeśhvaruni sedigi nī viyyam̐gānu
kaivasa mayidi naṭṭĕ kānī leve
nīvallane kādā ne middara mŏkka ṭaidi
māvaḍiṁchi yim̐kam̐ bāya maṭṭĕ kānī leve