Kaadanenaa imka neebai gaamtaalimchenaa

కాదనేనా ఇఁక నీపై గాఁతాళించేనా
Language

(॥పల్లవి॥)
కాదనేనా ఇఁక నీపై గాఁతాళించేనా
సాదవైతి వన్నిటాను సంగతాయఁ బనులు

(॥కాద॥)
చేయరానిచేఁత చేసి చెక్కవట్టి వేఁడుకోఁగా
ఆయనాయ నిందువంకనైనదేమి
నాయ మెవ్వరు చెప్పేరు నాకు నీకు నడుమను
చాయకుఁ దెచ్చుకొంటివి సంగతాయఁ బనులు

(॥కాద॥)
జాలిఁబెట్టి మాటలాడి సమ్మతిగాఁ జేయఁగాను
చాలుఁజాలు నిందువంక సాదించేదేమి
తాలి మెక్కడ నున్నది తవిసితి మిద్దరము
పోలికలు చూపేవు పొసఁగె నీపనులు

(॥కాద॥)
వెంట నాకెఁ దోడితెచ్చి వేరేమరఁగు వెట్టఁగా
కంటిఁగంటి నిందువంకఁ గలిగేదేమి
ఇంటివద్ద శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
జంటవై నెలకొంటివి చక్కనాయఁ బనులు

(||pallavi||)
kādanenā im̐ka nībai gām̐tāḽiṁchenā
sādavaidi vanniḍānu saṁgadāyam̐ banulu

(||kāda||)
seyarānisem̐ta sesi sĕkkavaṭṭi vem̐ḍugom̐gā
āyanāya niṁduvaṁkanainademi
nāya mĕvvaru sĕpperu nāgu nīgu naḍumanu
sāyagum̐ dĕchchugŏṁṭivi saṁgadāyam̐ banulu

(||kāda||)
jālim̐bĕṭṭi māḍalāḍi sammadigām̐ jeyam̐gānu
sālum̐jālu niṁduvaṁka sādiṁchedemi
tāli mĕkkaḍa nunnadi tavisidi middaramu
poligalu sūbevu pŏsam̐gĕ nībanulu

(||kāda||)
vĕṁṭa nāgĕm̐ doḍidĕchchi veremaram̐gu vĕṭṭam̐gā
kaṁṭim̐gaṁṭi niṁduvaṁkam̐ galigedemi
iṁṭivadda śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
jaṁṭavai nĕlagŏṁṭivi sakkanāyam̐ banulu