Kaadanemaa ninnunu kadu mechche mimte kaaga

కాదనేమా నిన్నును కడు మెచ్చే మింతే కాక
Language

(॥పల్లవి॥)
కాదనేమా నిన్నును కడు మెచ్చే మింతే కాక
సాదించితివి వలపు జాణకాఁడ వవుదువు

(॥కాద॥)
నయగారి మాటలెల్ల నాకుఁగా నేరిచితివి
క్రియ లెరుఁగుకొంటివి గేస్తురాండ్లలకు
దయదలఁతువు నీవు తరుణులైతేఁ జాలు
జయములే యెప్పుడును జాణకాఁడ వౌదువు

(॥కాద॥)
నగవులు సెలవుల నాకుఁగాఁ దెచ్చుకొంటివి
అగపడితి వట్టె పదారువేలకు
జిగిమించు గొల్లెతల సిగ్గులకు లోనైతివి
జగడము లేదు నీకు జాణకాఁడ వౌదువు

(॥కాద॥)
నంటున కాఁగిటఁ గూడి నాకే లోనైతివి
అంటక బాఁ పెతలవిం దారగించితి
వెంటెనె శ్రీ వేంకటేశ వేడుకకాఁడవై
జంటవాయ విటు నన్ను జాణకాఁడ వౌదువు

(||pallavi||)
kādanemā ninnunu kaḍu mĕchche miṁte kāga
sādiṁchidivi valabu jāṇagām̐ḍa vavuduvu

(||kāda||)
nayagāri māḍalĕlla nāgum̐gā nerisidivi
kriya lĕrum̐gugŏṁṭivi gesturāṁḍlalagu
dayadalam̐tuvu nīvu taruṇulaidem̐ jālu
jayamule yĕppuḍunu jāṇagām̐ḍa vauduvu

(||kāda||)
nagavulu sĕlavula nāgum̐gām̐ dĕchchugŏṁṭivi
agabaḍidi vaṭṭĕ padāruvelagu
jigimiṁchu gŏllĕdala siggulagu lonaidivi
jagaḍamu ledu nīgu jāṇagām̐ḍa vauduvu

(||kāda||)
naṁṭuna kām̐giḍam̐ gūḍi nāge lonaidivi
aṁṭaga bām̐ pĕdalaviṁ dāragiṁchidi
vĕṁṭĕnĕ śhrī veṁkaḍeśha veḍugagām̐ḍavai
jaṁṭavāya viḍu nannu jāṇagām̐ḍa vauduvu