కాదనేమా నేము నీ గయ్యాళితనములకు
(॥పల్లవి॥)
కాదనేమా నేము నీ గయ్యాళితనములకు
ఆదెస నీదెసను నీవాడినట్టే అయ్యీని
(॥కాద॥)
పంతమాడి నిన్ను నంత పరచఁగ నోపుదుమా
చెంత నుండి నీసేవ సేసేముగాక
యింత నీకు వేడుకై తెనెందునో యేమింక నేము
అంత వేగిరించకుమీ ఆడినట్టె అయ్యీని
(॥కాద॥)
సరికిబేసికి నిన్ను సాదించ నోపుదుమా
పెరరేఁచి చిత్తము దర్పించేముగాక
కరుణ నీకుఁ బుట్టితే కానిమ్మనఁగ వలదా
అరుదుగాఁ గోరకునీవినట్టె అయ్యీని
(॥కాద॥)
శ్రీవేంకటేశ నినను జీరదియ్య నోపుదుమా
మూవంకఁ గూడితి మిఁక మొక్కేముగాక
యీవలమన్నించితేను యెప్పడూ నీవారమే
ఆవిధాన నింకా నీవాడినట్టె అయ్యీని
(||pallavi||)
kādanemā nemu nī gayyāḽidanamulagu
ādĕsa nīdĕsanu nīvāḍinaṭṭe ayyīni
(||kāda||)
paṁtamāḍi ninnu naṁta parasam̐ga nobudumā
sĕṁta nuṁḍi nīseva sesemugāga
yiṁta nīgu veḍugai tĕnĕṁduno yemiṁka nemu
aṁta vegiriṁchagumī āḍinaṭṭĕ ayyīni
(||kāda||)
sarigibesigi ninnu sādiṁcha nobudumā
pĕrarem̐si sittamu darbiṁchemugāga
karuṇa nīgum̐ buṭṭide kānimmanam̐ga valadā
arudugām̐ goragunīvinaṭṭĕ ayyīni
(||kāda||)
śhrīveṁkaḍeśha ninanu jīradiyya nobudumā
mūvaṁkam̐ gūḍidi mim̐ka mŏkkemugāga
yīvalamanniṁchidenu yĕppaḍū nīvārame
āvidhāna niṁkā nīvāḍinaṭṭĕ ayyīni