కాదనగవచ్చునా ఘనుఁడ నీతోడి పొందు
(॥పల్లవి॥)
కాదనగవచ్చునా ఘనుఁడ నీతోడి పొందు
యేదైనా నియ్యకొంటె నెక్కుడేకాదా
(॥॥)
నీకు సెలవైతేఁజాలు నీమోహపుసతులకు
చేకొని ప్రియము లెల్లా జెప్పేమయ్యా
యీకడ నాకడ నీకు హితవైతేఁ జాలుఁగాక
మాకేమి వారినేరాలు మరచేవయ్యా
(॥॥)
నట్టనడుమను నీకు నవ్వువచ్చితేజాలు
వొట్టి వారిచేఁతలకు నోరిచేమయ్యా
మట్టుమీర నేఁడు నీమనసు వచ్చితేఁజాలు
గట్టిగా నెంగిలిపొత్తు గలసేమయ్యా
(॥॥)
చక్కఁగ నీకే పొందు సంతోసమైతేఁ జాలు
వొక్కచోట నిద్దరము నుండేమయ్యా
యిక్కువతో శ్రీ వేంకటేశ మమ్ముఁ గూడితివి
చిక్కించుక నీపాదాలసేవ సేసేమయ్యా
(||pallavi||)
kādanagavachchunā ghanum̐ḍa nīdoḍi pŏṁdu
yedainā niyyagŏṁṭĕ nĕkkuḍegādā
(||||)
nīgu sĕlavaidem̐jālu nīmohabusadulagu
segŏni priyamu lĕllā jĕppemayyā
yīgaḍa nāgaḍa nīgu hidavaidem̐ jālum̐gāga
māgemi vārinerālu marasevayyā
(||||)
naṭṭanaḍumanu nīgu navvuvachchidejālu
vŏṭṭi vārisem̐talagu norisemayyā
maṭṭumīra nem̐ḍu nīmanasu vachchidem̐jālu
gaṭṭigā nĕṁgilibŏttu galasemayyā
(||||)
sakkam̐ga nīge pŏṁdu saṁtosamaidem̐ jālu
vŏkkasoḍa niddaramu nuṁḍemayyā
yikkuvado śhrī veṁkaḍeśha mammum̐ gūḍidivi
sikkiṁchuga nībādālaseva sesemayyā