Kaadamtim bo ninnum baayamgalanaa nenu

కాదంటిఁ బో నిన్నుఁ బాయఁగలనా నేను
Language

(॥పల్లవి॥)
కాదంటిఁ బో నిన్నుఁ బాయఁగలనా నేను
ఆది గొని సారె దూరేదది యెడ్డతనము

(॥కాదం॥)
నగుతూ విచ్చేసి నీవు నన్ను నేఁడు చెనకఁగా
బిగియుచు నుండే దేమి పెద్దరికము
తగవరివైన నీవు తమ్ములము వెట్ట రాఁగా
మొగమీయ కుండేది మొక్కలపుగుణము

(॥కాదం॥)
పరగ నొద్దనుండి నాపైఁ జేయివేయఁగాను
యెరవు చేసుకవుండే దేఁటి నేరుపు
సరసమాడి నాదిక్కు చక్క నీవు చూడఁగాను
అరుదంది సిగ్గువడే దదియేఁటి చెలిమి

(॥కాదం॥)
కందువల నన్ను నీవు కాగిలించుకొనఁగాను
పొందుసేయకుండే దేఁటిబుద్దిలోనిది
అంది శ్రీవేంకటేశ్వర అలమితి విటు నన్ను
యిందుకే నే మెచ్చితి నిదే జాణతనము

(||pallavi||)
kādaṁṭim̐ bo ninnum̐ bāyam̐galanā nenu
ādi gŏni sārĕ dūredadi yĕḍḍadanamu

(||kādaṁ||)
nagudū vichchesi nīvu nannu nem̐ḍu sĕnagam̐gā
bigiyusu nuṁḍe demi pĕddarigamu
tagavarivaina nīvu tammulamu vĕṭṭa rām̐gā
mŏgamīya kuṁḍedi mŏkkalabuguṇamu

(||kādaṁ||)
paraga nŏddanuṁḍi nābaim̐ jeyiveyam̐gānu
yĕravu sesugavuṁḍe dem̐ṭi nerubu
sarasamāḍi nādikku sakka nīvu sūḍam̐gānu
arudaṁdi sigguvaḍe dadiyem̐ṭi sĕlimi

(||kādaṁ||)
kaṁduvala nannu nīvu kāgiliṁchugŏnam̐gānu
pŏṁduseyaguṁḍe dem̐ṭibuddilonidi
aṁdi śhrīveṁkaḍeśhvara alamidi viḍu nannu
yiṁduge ne mĕchchidi nide jāṇadanamu