కాదంటేఁ బోవునా ఘనుఁడు చెప్పినపని
(॥పల్లవి॥)
కాదంటేఁ బోవునా ఘనుఁడు చెప్పినపని
ఆదుకొని యాడినట్టే ఆడవలెఁ గాక
(॥కాదంటే॥)
తగవు తాఁ జెప్పునట తప్పులెంచఁ జోటేది
వెగటు లేకిద్దరము వినేముగాక
జగడాలు వెట్టి తానే సందిమాటలాడునట
పొగడి మాలో నేమే పొసఁగేము గాక
(॥కాదంటే॥)
దోసము లేదనునట తోసి పోనాడఁగనేమి
వేసారక యిద్దరమ వినేము గాక
వాసులు రేఁచి తానే వద్దని కూరుచునట
బాసలు నేమే సేసుక బతికేము గాక
(॥కాదంటే॥)
ఇద్దరిఁ దా నేలునట యీసడించ నేమిపని
వొద్ద నిరుదిక్కులా నుండేము గాక
అద్దొ శ్రీ వేంకటేశుఁడంటె బుద్ధి చెప్పునట
వుద్దండాలు మాని నేమే వొనరేము గాక
(||pallavi||)
kādaṁṭem̐ bovunā ghanum̐ḍu sĕppinabani
ādugŏni yāḍinaṭṭe āḍavalĕm̐ gāga
(||kādaṁṭe||)
tagavu tām̐ jĕppunaḍa tappulĕṁcham̐ joḍedi
vĕgaḍu legiddaramu vinemugāga
jagaḍālu vĕṭṭi tāne saṁdimāḍalāḍunaḍa
pŏgaḍi mālo neme pŏsam̐gemu gāga
(||kādaṁṭe||)
dosamu ledanunaḍa tosi ponāḍam̐ganemi
vesāraga yiddarama vinemu gāga
vāsulu rem̐si tāne vaddani kūrusunaḍa
bāsalu neme sesuga badigemu gāga
(||kādaṁṭe||)
iddarim̐ dā nelunaḍa yīsaḍiṁcha nemibani
vŏdda nirudikkulā nuṁḍemu gāga
addŏ śhrī veṁkaḍeśhum̐ḍaṁṭĕ buddhi sĕppunaḍa
vuddaṁḍālu māni neme vŏnaremu gāga