Kaa dani meemaamta kadasemaa

కా దని మీమాఁట కడచేమా
Language

(॥పల్లవి॥)
కా దని మీమాఁట కడచేమా
సోదించి మమ్మే సొలయఁగ రాదా

(॥కా దని॥)
తెలిసినమాఁటకు తెరమరఁ గేఁటికి
చెలులు తగవు లిటు చెప్పరే
అలిగి యిద్దరము నటు నిటు నుండఁగ
చల మే లని మమ్ము జంకించ రాదా

(॥కా దని॥)
మునుపు వెన కెరిఁగి మొగమో టేఁటికి
అనవలసినట్ల నాడరే
పెనఁగుచు మాతో బీరము లాడఁగ
కనుసన్నలచే కలఁపఁగ దగదా

(॥కాదని॥)
అమరినపనులకు ననుమాన మేల
సమము సేసితిరి సరుగ మమ్ము
క్రమమున శ్రీవెంకటపతి గూడెను
గుము రై మా కిటు గురిగాఁ దగదా

(||pallavi||)
kā dani mīmām̐ṭa kaḍasemā
sodiṁchi mamme sŏlayam̐ga rādā

(||kā dani||)
tĕlisinamām̐ṭagu tĕramaram̐ gem̐ṭigi
sĕlulu tagavu liḍu sĕppare
aligi yiddaramu naḍu niḍu nuṁḍam̐ga
sala me lani mammu jaṁkiṁcha rādā

(||kā dani||)
munubu vĕna kĕrim̐gi mŏgamo ṭem̐ṭigi
anavalasinaṭla nāḍare
pĕnam̐gusu mādo bīramu lāḍam̐ga
kanusannalase kalam̐pam̐ga dagadā

(||kādani||)
amarinabanulagu nanumāna mela
samamu sesidiri saruga mammu
kramamuna śhrīvĕṁkaḍabadi gūḍĕnu
gumu rai mā kiḍu gurigām̐ dagadā