(॥పల్లవి॥)
కా దనకు నామాట కడపరాయ - నీకు
గాదెఁబోసే వలపులు కడపరాయ
(॥॥)
కప్పుర మియ్యఁగరాదా కడపరాయా- నీకుఁ
గప్పితి నాపయ్యెదెల్లఁ గడపరాయా-వో
కప్పుమివే కుచములు కడపరాయా-వో
కప్పుమొయిలు మేనిచాయ కడపరాయ
(॥॥)
కందువకు రారాదా కడపరాయా-ముందే
గందమిచ్చినవాఁడవు కడపరాయ
కందము నీమాటలిఁక గడపరాయా-వో
కందర్పగురుఁడ మొక్కేఁ గడపరాయ
(॥॥)
కలసితివిటు నన్నుఁ గడపరాయా-నా
కల నేఁడు నిజమాయఁ గడపరాయ
కలదాననే నీకుఁ గడపరాయా-వో
కలికి శ్రీవేంకటాద్రి కడపరాయా
(||pallavi||)
kā danagu nāmāḍa kaḍabarāya - nīgu
gādĕm̐bose valabulu kaḍabarāya
(||||)
kappura miyyam̐garādā kaḍabarāyā- nīgum̐
gappidi nābayyĕdĕllam̐ gaḍabarāyā-vo
kappumive kusamulu kaḍabarāyā-vo
kappumŏyilu menisāya kaḍabarāya
(||||)
kaṁduvagu rārādā kaḍabarāyā-muṁde
gaṁdamichchinavām̐ḍavu kaḍabarāya
kaṁdamu nīmāḍalim̐ka gaḍabarāyā-vo
kaṁdarbagurum̐ḍa mŏkkem̐ gaḍabarāya
(||||)
kalasidiviḍu nannum̐ gaḍabarāyā-nā
kala nem̐ḍu nijamāyam̐ gaḍabarāya
kaladānane nīgum̐ gaḍabarāyā-vo
kaligi śhrīveṁkaḍādri kaḍabarāyā